Begin typing your search above and press return to search.
అ టీజర్-వావ్ అనిపించిందిగా
By: Tupaki Desk | 4 Jan 2018 11:43 AM GMTన్యాచురల్ స్టార్ నాని తాను హీరోగా కాకుండా కేవలం కథ నచ్చి నిర్మాతగా మారి సినిమా తీయడానికి ముందు వచ్చాడు అంటేనే అందులో ఏదో ప్రత్యేకత ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి వచ్చినప్పటి నుంచే దీని గురించి ప్రత్యేకమైన అంచనాలు ఏర్పడ్డాయి. అదే అ!. ఇందాకే అఫీషియల్ టీజర్ విడుదల చేసారు. నాని చేపకు - రవితేజ చెట్టుకి ఇచ్చిన వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తి రేపెలా ఉంది. చెట్టు ఏదైనా కథ చెప్పమని చేపను అడగటం - అనగనగా ఓ రాజుకు ఏడుగురు కొడుకులు అని చేప స్టార్ట్ చేయబోతే ఏదైనా కొత్తది చెప్పమని చెట్టు అడగటం ఇలా చాలా వెరైటీగా సాగింది టీజర్.
నిత్యా మీనన్ ఎంట్రీ తో స్టార్ట్ చేసి అవసరాల శ్రీనివాస్ ఏదో ఎక్స్ పెరిమెంట్ చేస్తున్నట్టు చూపించి ముందుకు వెళ్ళే కొద్ది ఇంట్రెస్ట్ ని పీక్స్ కు తీసుకెళ్ళారు. చెఫ్ గా ప్రియదర్శి - మెజీషియన్ గా మురళి శర్మ ఇంతకు ముందు చూడని గెటప్స్ లో కనిపిస్తారు.రెజినా ఫస్ట్ టైం డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో నెగటివ్ షేడ్స్ ఏమైనా ఉన్నాయేమో అని అనుమానం వచ్చేలా తన పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసారు. ఇందులో ఉన్న ఏ ఆర్టిస్ట్ ని గతంలో చూసామే అన్న ఫీలింగ్ రాకుండా చాలా కొత్తగా సెట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ సంథింగ్ స్పెషల్ అనేలా ఉంది. చివరిలో కాజల్ వాష్ రూమ్ లో తన మొహాన్ని అద్దం ముందు తుడుచుకుని సీరియస్ గా చూసుకునే ఫినిషింగ్ టచ్ కూడా బాగా పేలింది.
కథ గురించి ఊహించుకోవడానికి ఏ మాత్రం క్లూ ఇవ్వకుండా కట్ చేసిన విధానం నిజంగా సూపర్ అనిపిస్తోంది. ఒక కెఫెటేరియా దీంట్లో సెంట్రల్ పాయింట్ గా అనిపిస్తోంది కాని దాని గురించి ఎక్కువ ఆలోచించే అవకాశం ఇవ్వలేదు దర్శకుడు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. కార్తీక్ ఘట్టమనేని పనితనం కెమెరాలో కనిపిస్తే ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ కొత్త తరహా వాతావరణాన్ని సృష్టించి భలే అనిపించాడు. దీంట్లో కథే హీరో అని చేపతో చెప్పించిన నాని రిలీజ్ అయ్యాక కంటెంట్ హీరో అని ఋజువు చేసేలా ఉన్నాడు.