Begin typing your search above and press return to search.
నోరు తెరిచి నిద్రపోతాడు.. బిగ్గరగా గురక పెడతాడు!
By: Tupaki Desk | 23 Sep 2022 3:46 AM GMTకొన్నేళ్ల పాటు నిరీక్షణ.. అనేక జాప్యాల తరువాత.. రణబీర్ కపూర్- అలియా భట్ నటించిన 'బ్రహ్మస్త్ర' సెప్టెంబర్ 9 న థియేటర్లలో విడుదలైంది. మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించిందని ఉత్తరాది మీడియా కథనాలు వండి వార్చాయి. థియేటర్లకు జనాల్ని రప్పించి హిందీ పరిశ్రమకు కొంత మేర ఉపశమనం కలిగించిందని కూడా టీమ్ చెబుతోంది. ఈ చిత్రం పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదల కావడం ప్లస్ అయ్యింది.
దర్శకుడు అయాన్ ఇప్పటికీ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉత్సాహంగానే ఉన్నాడు. అయాన్ తో రణబీర్ స్నేహం వారి మొదటి చిత్రం 'వేక్ అప్ సిద్' నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రణబీర్-అయాన్ ఆ తర్వాత 'యే జవానీ హై దీవానీ'కి కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఆ బ్రహ్మాస్త్రతో తిరిగి వచ్చారు. వీరిద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులు. తరచుగా కలిసి ఈవెంట్ లకు హాజరవుతూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజా ప్రమోషనల్ ఈవెంట్లో ఓ మీడియాతో ముచ్చటిస్తూ అయాన్ ర్యాపిడ్-ఫైర్ రౌండ్ లో రణబీర్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అయాన్ ను రణబీర్ గురించి ఒక విషయం అడిగారు. అది ఇంతవరకూ ఎవరికీ తెలియని రహస్యం అని అయాన్ తెలిపాడు.
''రణబీర్ చాలా మంచి శ్రోత'' అని బెస్ట్ కాటాన్ ప్లేయర్ (గురక బాబు) అని నిదుర లేపడానికి నేను మూడుసార్లు తనని కొట్టాల్సొచ్చిందని(తట్టి లేపడం) అన్నాడు. అయాన్ ఇంకా చెబుతూ... ''అతను(రణబీర్) నోరు తెరిచి నిద్రపోతాడు.. బిగ్గరగా గురక పెడతాడు..'' అని తెలిపాడు.
రణబీర్ మాత్రమే కాదు.. అలియా భట్ కూడా అయాన్ తో బలమైన స్నేహానుబంధాన్ని కలిగి ఉంది. సైన్స్ ఫిక్షన్ మూవీ బ్రహ్మాస్త్రతో ఆ ముగ్గురి స్నేహం సెట్ లలో మరింత బలంగా పెరిగింది.
బ్రహ్మాస్త్ర గురించి లో నాగార్జున అక్కినేని- మౌని రాయ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. షారూఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం హిందీ- తమిళం- తెలుగు- మలయాళం- కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9 న విడుదలైంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను ఎప్పుడూ బాక్సాఫీస్ నంబర్ లకు ఎక్కువ విలువ ఇస్తానని వెల్లడించాడు. నంబర్స్ కూడా ముఖ్యమని నేను భావిస్తాను. నా రెండవ సినిమా నుండి నేను సైన్ చేసిన ప్రతి సినిమాలో ఎల్లప్పుడూ వినోదానికి ప్రాధాన్యతను చూస్తాను. అది వేక్-అప్ సిద్ - లేదా బర్ఫీ వంటి సినిమా అయినా.. లేదా రాకెట్ సింగ్ లాంటి సినిమా అయినా- అది బాక్సాఫీస్ వద్ద వర్కవుటైనా అవ్వకపోయినా కానీ.. నేను ఒక చిత్రానికి సంతకం చేసినప్పుడు అది బాక్సాఫీస్ వద్ద వర్కవుటవ్వాలని కోరుకుంటాను.. అని రణబీర్ అన్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.