Begin typing your search above and press return to search.
ప్రముఖ నటికి..ఆమె ఫ్యామిలీకి బెదిరింపులు
By: Tupaki Desk | 4 July 2018 6:48 AM GMTకింగ్ నాగార్జున నటించిన సూపర్ సినిమా గుర్తుందా? అందులా ఒక హీరోయిన్ గా నటించిన అయేషా టకియా గుర్తుందా? తన తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షించిన ఆమె తర్వాతి కాలంలో బాలీవుడ్‌లో సెటిల్ కావటంతో తెలుగు సినిమాలుపెద్దగా చేయలేదు.
ఆ మధ్యన పెళ్లి చేసుకున్న ఆమె.. గడిచిన కొద్దికాలంగా ఒక గుర్తు తెలియని వ్యక్తి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ఆమె భర్త తాజాగా వెల్లడించారు. అయేషాను ఆమె కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడని.. చంపేస్తానని బెదిరిస్తున్న వైనాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె భర్త వెల్లడించారు. ఈ విషయంపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుచెప్పారు.
అయితే.. తమ ఫిర్యాదు విషయంలో డీసీపీ దాహియా పెద్దగా పట్టించుకోవటం లేదని.. తమ మెసేజ్ లకు ఆయన సమాధానం ఇవ్వటం లేదని వాపోయారు. తమ ఫోన్ కాల్స్ ను.. మెసేజ్ లను పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారి తమ బ్యాంక్ ఖాతాల్ని బ్లాక్ చేసిన వైనాన్ని బయటపెట్టారు.
అంతేకాదు.. తాము డీసీపీ దాహియాకు ఫిర్యాదు చేయటం.. ఆ తర్వాత కాలంలో ఆయనకు పెట్టిన మేసేజ్ లను అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బెదిరింపుల నుంచి తమను రక్షించాలని.. తమకు సాయం చేయాలంటూ ప్రధాని మోడీకి.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరారు. బేటీ బచావో అంటూ ట్విట్టర్ లో సందేశాన్ని ఉంచారు.
అదే సమయంలో తమ ఫిర్యాదుపై స్పందించని డీసీపీ దాహియాపై ట్వీట్లు చేస్తూ.. మిస్టర్ దాహియా నిద్ర లేవండి. మా ఫోన్లకు స్పందించండి అని పేర్కొన్నారు. తాను గతంలో డీసీపీకి పంపిన మేసేజ్ లను స్క్రీన్ షాట్ల రూపంలో ట్వీట్ చేశారు. తమకు ముంబయి ప్రజలు మద్దతు పలకాలని కోరారు. దీంతో.. ముంబయి సీపీ దేవెన్ భారతి రియాక్ట్ అయ్యారు.
బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుంటామని.. ఫిర్యాదును పరిష్కరిస్తామని మాటిచ్చారు. దీనిపై అయేషా భర్త స్పందిస్తూ.. తనకు ముంబయి పోలీసుల మీద నమ్మకం ఉందంటూ మెసేజ్ పెట్టారు. ఒక బాలీవుడ్ ప్రముఖ నటికి బెదిరింపులకు గురైతే.. ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా రియాక్షన్ ఇలానా ఉండేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.