Begin typing your search above and press return to search.
హీరో చెల్లిని పెళ్లి చేసుకుంది డబ్బు కోసం కాదు!
By: Tupaki Desk | 2 Jun 2023 9:00 AM GMTసల్మాన్ ఖాన్ సోదరి అర్పితఖాన్-ఆయుశ్ శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తొమ్మిదేళ్ల క్రితం ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు..కుమార్తె కలరు. పిల్లపాపలతో వాళ్ల జీవితం సంతోషంగా సాగిపోతుంది. అయితే ఆయుశ్ శర్మని మాత్రం నాటి నుంచి డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడంటూ సూటిపోటి విమర్శలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. ఇప్పటికీ ఈ రకమైన కథనాల్లో ఆయుశ్ పేరు వినిపిస్తుంది.
అర్పితఖాన్ సల్మాన్ సొంత సోదరి కాకపోవడంతోనే ఈ రకమైన విమర్శలు ఎదుర్కుంటున్నాడు. తాజాగా ఈ విమర్శలపై ఆయుశ్ శర్మ ధీటుగా స్పందించారు. 'అర్పిత చాలా శక్తివంతమైన అమ్మాయి. తనలాంటి మహిళ భార్యగా రావడం నా అదృష్టం. మా మీద జరిగే ట్రోలింగ్ మమ్మల్ని పెద్దగా బాధించదు. ఎందుకంటే అవన్నీ అవాస్తవాలే కాబట్టి.
పై గా సినీ రంగంలో ఉన్నవారి విషయంలో ఇలాంటివన్నీ సహజంగా వస్తూనే ఉంటాయి. కానీ అర్పితని కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అనే ప్రచారం నన్నెంతగానే బాధపెడుతుంది.
నటుడిగా ఎదగడం కోసం ఇలా చేసానంటున్నారు. నేను డబ్బుని కాదు. అర్పితని ప్రేమించాను. అందుకు తనని పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం తనకు...మా కుటుంబాలకు బాగా తెలుసు. వెకేషన్ కి వెళ్లినప్పుడు సల్మాన్ ఖాన్ డబ్బు వాడుకుంటానని అంటున్నారు.
పెళ్లి కి భాయ్ రోల్స్ రాయిస్ కారు గిప్ట్ గా ఇచ్చాడని అంటున్నారు. మరి ఆ రోల్స్ రాయిస్ కారు నా దగ్గర ఎక్కడుందో మీరే చెప్పాలి' అని అన్నారు.
అర్పిత అనాధ బాలిక. ఆమెని చిన్నప్పుడే సల్మాన్ ఖాన్ కుటుంబం దత్తత తీసుకుంది. ఆమెని పెంచి ప్రయోజకురాల్ని చేసి పెళ్లి చేసుకుంది కూడా సల్మాన్ ఖాన్. ఇక ఆయుశ్ శర్మ మాజీ కేబినెట్ మంత్రి సుఖ్ రామ్ మనవడు. 'లవ్ యాత్రి'..'అంతిమ్' చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అర్పితని వివాహం చేసుకున్నా! ఇంకా అతడేమి పెద్ద స్టార్ కాలేదు. ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నాడు.