Begin typing your search above and press return to search.
ఆయుష్మాన్ ఖురానా కి అంత తల పొగరా?
By: Tupaki Desk | 4 Dec 2022 11:30 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రం `విక్కీడోనర్` తో విజయం అందుకుని బాలీవుడ్ అంతటా ఫేమస్ అయిపోయాడు. మొదటి సినిమాతోనే నటుడిగా ఆ స్థాయి గుర్తింపు అంటే? సాధారణ విషయం కాదు..రెండు..వరుస సక్సెస్ లతో రావాల్సిన గుర్తింపు ఒక్క సినిమాతోనే వచ్చేసింది.
అటుపై `బధాయి హో` చిత్రంతో జాతీయ స్థాయిలో వెలిగిపోయాడు. ఆ సినిమాకు గానూ ఉత్తమ నటుడు అవార్డు అందుకు న్నాడు. బుల్లి తెర నుంచి పెద్ద తెరకు ప్రమోట్ అయిన నటుల్లో ఆయుష్మాన్ కూడా ఒకడిగా నిలిచాడు. దీంతో మనోకి హెడ్ వెయిట్ కూడా పెరిగిపోయిందని అప్పట్లో బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది.
ఒక హిట్ సినిమా కే అహంకారం చూపిస్తున్నాడంటూ ఇండస్ర్టీ అంత చర్చ నడిచింది. తాజాగా ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా తన తలపొగరు నిజమేనని ఒప్పుకున్నాడు. `నా తొలి సినిమా హిట్ తోనే నాలో అహంకారం పెరిగిపోయింది. ఏదో సాధించేసాను అన్న ఎగ్జైట్ మెంట్కి గురయ్యాను. ఆ మత్తులో ఎవర్నీ పట్టించుకోలేదు.
ఎవడైతే నాకేంటి? అన్న తరహాకి వెళ్లిపోయాను. నటుడిగా నాకు తిరుగులేదు. ఇండస్ర్టీని దున్నేస్తాను అనుకున్నాను. కానీ ఆ తర్వాత వరుస వైఫల్యాలు చాలానే ఎదురయ్యాయి. నేను అనుకున్నకథలు నా వద్దకు రాలేదు. వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్లాను. దీంతో వరుస పరాజయాలు వెంటాడాయి. అయితే `ధమ్ లగాకే` చిత్రంవిడుదల నాటికి నాకు పెరిగిన తల పొగరు అంతా ఒక్కసారిగా దిగిపోయింది.
ఎంత ఎదిగినా భూమ్మీద నిలబడాలి అన్న విషయం అర్ధమైంది. అప్పటి నుంచి నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాను` అని తెలిపారు. ఆయన నటించిన `యాక్షన్ హీరో` ఇటీవలే రిలీజ్ అయింది. త్వరలో `డ్రీమ్ గర్ల్ -2` తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.