Begin typing your search above and press return to search.
130 కోట్ల జనాభాలో ఒకే ఒక్కడూ అంటూ పొగిడేసిన దీపిక
By: Tupaki Desk | 23 Sep 2020 11:30 AM GMTఓవైపు బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు అట్టుడికించేస్తోంది. సుశాంత్ కేసు ఓవైపు డ్రగ్స్ ఇంకో వైపు అల్లాడిస్తున్నాయి. ఈలోగానే టైమ్ 100 జాబితా కొంత టాపిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నమే. ఏదైతేనేం..యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా 2020లో టైమ్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా జాబితాలో చేరాడు.
2020లో టైమ్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న దీపికా పదుకొనే ఆయుష్మాన్ ఖురానాను ప్రశంసలతో ముంచెత్తింది. ఆయుష్మాన్ తన సోషల్ మీడియా లో కూడా ఈ విషయాన్ని షేర్ చేశాడు. జాబితాలో భాగమైనందుకు తనకు గౌరవం ఉందని అన్నారు.
టైమ్ 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు అంటూ ఆయుష్మాన్ ఖురానా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గుర్తింపుతో ఆయుష్మాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత స్టార్ల జాబితాలో చేరారు. దీపికా పదుకొనే హృదయపూర్వక నోట్ రాశారు. అతడు ఈ చోటికి చేరుకోవడంలో ఆయన కృషి అంకితభావాన్ని ప్రశంసించారు. ఆయుష్మాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఈ వార్తలను పంచుకున్నాడు. అతను గౌరవం దక్కిందని ఆనందం వ్యక్తం చేశాడు.
వినోద వ్యాపారంలో మన కథానాయకులు తరచూ తెరపై మూస పాత్రలతో బలైపోతారు. ఆయుష్మాన్ విజయవంతంగా .. నమ్మకంగా ఆ మూస పద్ధతులను సవాలు చేసే పాత్రలతో సత్తా చాటాడు`` అంటూ దీపిక పొగిడేసింది. భారతదేశంలో 1.3 బిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నా.. చాలా తక్కువ శాతం మంది మాత్రమే వారి కలలు సజీవంగా నిలుపుకోవడానికి సాధించుకోవడానికి చూస్తారు. ఆయుష్మాన్ ఖురానా వారిలో ఒకరు అంటూ కితాబిచ్చేసింది. 130 కోట్ల జనాభాలో ఒకే ఒక్కడూ అంటూ పొగిడేసిన దీపిక పొగడ్త ఆయుష్మాన్ కి బిగ్ బూస్ట్ ఇచ్చేదే. ఇక బాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన యువహీరోగా ఆయుష్మాన్ కి గుర్తింపు ఉంది.