Begin typing your search above and press return to search.

కరణ్ నా ఆశలపై కూడా నీళ్లు చల్లాడు: స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Jun 2020 2:30 AM GMT
కరణ్ నా ఆశలపై కూడా నీళ్లు చల్లాడు: స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయుష్మాన్ ఖురానా అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ టాలెంటెడ్ యంగ్ హీరో టీవీ వేదిక పై తన కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా వెలుగొందుతున్నాడు. ఇక ఇటీవలే హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య పట్ల ఇండస్ట్రీలో కరణ్ జోహార్ తీరు పై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. సామాన్యుల నుండి సినీ ప్రముఖుల వరకు కరణ్ జోహార్ తీరుపై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. తాజాగా కరణ్ తీరు పై యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా స్పందించాడు. ఇండస్ట్రీలో కరణ్ జోహార్ కేవలం పేరుమోసిన స్టార్ల వారసులనే ఎంకరేజ్ చేస్తాడు. కేవలం బంధుప్రీతితో మెలుగుతూ.. తన వర్గం వారికే అవకాశాలు అందేలా సినీ రాజకీయాలు నడిపిస్తాడని ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలకు దారితీస్తోంది.

ఇక తాజాగా కరణ్ జోహర్ తీరును వివరిస్తూ ఆయుష్మాన్ ఖురానా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. కరణ్ తో నాకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటున్నాడు. "నటుడిగా నా కెరీర్ ప్రారంభంలో ధర్మా ప్రొడక్షన్స్ ఆఫీస్‌ వారు స్టార్లతో.. వాళ్ల వారసులతో మాత్రమే సినిమాలు తీస్తాం. నీలాంటి వారికి అవకాశాలు ఇవ్వడం కుదరదని ముఖం మీదే చెప్పారు. కానీ స్టార్టింగ్ కాబట్టి నేను అంతగా పట్టించుకోలేదు.. అంటూ ఓ చేదు అనుభవాన్ని బయట పెట్టాడు. ఇక మరో విషయం చెప్తూ.. "కరణ్ జోహర్ నన్ను కలవమని స్వయంగా తన ఆఫీస్ ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాడు.

ఆ తర్వాత ఆ నంబర్‌కు కాల్ చేస్తే కరణ్ లేరని చెప్పారు. మరొక రోజు కాల్ చేస్తే.. ఆయన బిజీగా ఉన్నారని చెప్పి నా ఆశలపై నీళ్లు చల్లారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కాల్ చేస్తే నీలాంటి వర్ధమాన నటులతో ధర్మ ప్రొడక్షన్ సినిమాలు తీయదు. కేవలం ఓ రేంజ్‌లో ఉన్న స్టార్స్‌తోనే సినిమాలు చేస్తామని.. చాలా దురుసుగా చెప్పినట్లు ఆయుష్మాన్ తెలిపాడు. ఆ టైంలో నాకు షూజిత్ సర్కార్ 'విక్కీ డోనార్' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో నాకు మంచి గుర్తింపు.. ప్రశంసలు పొందాను. ఆ సినిమాతో గాయకుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. తర్వాత విభిన్నమైన సినిమాలలో నటిస్తూ కెరీర్లో స్థిరపడినట్లు ఆయుష్మాన్ తెలిపాడు. అలా కరణ్ జోహార్ ప్రభావం టాలెంటెడ్ యాక్టర్ల అందరి పై ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.