Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్‌ కోసం బి.కామ్ లో ఫిజిక్స్

By:  Tupaki Desk   |   17 May 2017 11:41 AM GMT
రాజ్ తరుణ్‌ కోసం బి.కామ్ లో ఫిజిక్స్
X
ఇప్పుడు బి.కామ్ లో ఫిజిక్స్ అనే లైన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల్లో ఫుల్ పాపులర్ సబ్జెక్టు. టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చాలా నొక్కి వక్కాణిస్తూ బికామ్ లో తాను ఫిజిక్స్ చదువుకున్నానని చెప్పడంతో.. తెలుగు రాష్ట్రాలు గొళ్లుమన్నాయ్. అయితే ఇప్పుడు ఈ పాపులర్ లైన్ ను సినిమాల్లో కూడా వీలైనప్పుడల్లా వాడేస్తున్నారు.

ఆల్రెడీ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్ర్తి ఇదే లైన్ ను మహేష్‌ బాబు 'స్పైడర్' కోసం వాడేశారని టాక్ ఉంది. అయితే ఆయన దానిని రాంగ్ న్యూస్ అంటూ ఖండించారు. కట్ చేస్తే ఇప్పుడు అదే లిరిక్ రైటర్.. సదరు ప్రయోగాన్ని మరో సినిమాకు చేసేశారు. రాజ్ తరుణ్‌ అండ్ హెబ్బా పటేల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ''అంధగాడు''. ఈ సినిమాతో రైటర్ వెలిగొండ శ్రీనివాస్ డైరక్టర్ గా మారుతున్నాడు. ఈ సినిమాలోని 'అందగాడు ఆటకొచ్చాడే' అనే పాటలో.. ''బి.కామ్ లోని ఫిజిక్సులా.. నీ నడుమెక్కడే నాజూకు తీగ'' అంటూ ఒక లైన్ రాశారు. నిజానికి హెబ్బా నడుం అంత నాజూకుగా లేనప్పటికీ.. బి.కామ్ లో ఫిజిక్స్ అనే లైన్ కారణంగా ఈ లిరిక్ పాపులర్ అవుతోంది.

ఇకపోతే కరెంట్ ఎఫైర్స్ ను తీసుకుని లిరిక్స్ లోకి జొప్పించడం కొత్త విషయం కాదులే. ఇలా చాలామంది చాలా ప్రయోగాలే చేశారు. చూద్దాం ధియేటర్లో ఈ బి.కామ్ ఫిజిక్స్ కు ఎంత క్రేజ్ వస్తుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/