Begin typing your search above and press return to search.
'ఇంద్ర' కోసం 5 బ్లాక్ టిక్కెట్లను 10 వేలకి కొన్నారట!
By: Tupaki Desk | 7 Jan 2022 1:30 AM GMTదర్శకుడు బి.గోపాల్ పేరు వినగానే బాలకృష్ణతో ఆయన చేసిన మాస్ యాక్షన్ సినిమాలు కళ్లముందు కదలాడతాయి. అయితే బాలకృష్ణతో భారీ ఫ్యాక్షన్ సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను అందించిన ఆయన, చిరంజీవితోను 'ఇంద్ర' సినిమా రూపొందించి, సంచలన విజయాన్ని నమోదు చేశారు. 2002 లో వచ్చిన 'ఇంద్ర' సినిమా చిరంజీవి కెరియర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. కథ .. మాటలు .. పాటలు .. డాన్సులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాను గురించిన విషయాలను బి.గోపాల్ గుర్తుచేసుకున్నారు.
"ఇంద్ర సినిమా ఒక సెన్సేషన్ .. కథా పరంగా .. సాంగ్స్ పరంగా .. నాకు బాగా గుర్తుండిపోయే సినిమా అది. చిరంజీవి గారు చాలా అద్భుతంగా చేశారు. 'దాయి దాయి దామ్మా' .. 'భం భం బోలే' .. 'రాధే గోవిందా' ఈ మూడు పాటలు కూడా దేనికదే డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఆ పాటలకి ఆయన అద్భుతంగా డాన్స్ చేశారు. 'మొక్కే కదా అని పీకాలని చూస్తే పీక కోస్తా' .. 'తప్పు మా వైపు ఉంది గనుక తలవంచుకుని వెళుతున్నా .. లేదంటే తలలు తీసుకుని వెళ్లేవాడిని ' వంటి డైలాగ్స్ ను గొప్పగా చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక విషయం మాత్రం ఇక్కడ చెప్పాలి.
సాధారణంగా బ్లాక్ లో టికెట్ల కోసం 500 .. 600 పెడుతుంటారు. కానీ ఆ రోజుల్లో ఫస్టు డే టిక్కెట్లు దొరక్కపోతే, ఒక వ్యక్తి పదివేల రూపాయలు పెట్టి 5 టిక్కెట్లు తీసుకున్నట్టుగా తెలిసింది. అదీ చిరంజీవిగారికి ఉన్న క్రేజ్. ఆ తరువాత కొన్ని రోజులకు నేను అవుట్ డోర్ షూటింగు కోసం వెళ్లినప్పుడు, అక్కడి లేడీ ఎస్పీ గారు మమ్మల్ని డిన్నర్ కి పిలిచారు. ఆ సమయంలో ఆమె ఏం చెప్పారంటే, "సాధారణంగా ఏ సినిమా విడుదలైనా ఎస్ ఐ స్థాయివారు వెళ్లి జనాలను కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. 'ఇంద్ర' సినిమాకి మాత్రం నేను కూడా వెళ్లి కంట్రోల్ చేయవలసిన పరిస్థితి వచ్చింది" అని ఆమె చెప్పారు.
ఇక ఈ సినిమాలో మా అందరికీ మంచి ఎక్స్ పీరియన్స్ .. కాశీ షెడ్యూల్. అందుకోసం మేమంతా డిసెంబర్ 31వ రోజున అక్కడ ఉన్నాము. రాఘవేంద్రరావుగారిని .. అల్లు అరవింద్ గారిని .. కె. విశ్వనాథ్ గారిని చిరంజీవిగారు కాశీకి పిలిపించారు. ఈ రోజున మనమంతా కలిసి గడపాలని చెప్పేసి అక్కడే అందరినీ ఉంచారు. సాంగ్స్ చేయడానికి ముందు ఏ మాత్రం సమయం దొరికినా ఆయన రిహార్సల్స్ చేసేవారు. నేను 'స్టేట్ రౌడీ' చేసేటప్పుడు చిరంజీవిగారు ఎలా కష్టపడేవారో, 'ఇంద్ర' చేస్తున్నప్పుడు కూడా అంతే కష్టపడటం చూశాను. ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారో అప్పుడు అర్థమైంది" అంటూ చెప్పుకొచ్చారు.