Begin typing your search above and press return to search.
బాలయ్యతో అలా చేయించి తప్పుచేశా!
By: Tupaki Desk | 13 Feb 2020 11:46 AM GMTమాస్ చిత్రాలకు.. ఫ్యాక్షన్ చిత్రాలకు అప్పట్లో పెట్టింది పేరుగా నిలిచిన దర్శకుడు బి గోపాల్. ఈయన నుండి వచ్చిన సీమ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. లారీ డ్రైవర్.. రౌడీ ఇన్సిపెక్టర్.. సమరసింహారెడ్డి.. నరసింహనాయుడు.. ఇంద్ర ఇంకా పలు ఇండస్ట్రీ హిట్స్ ను కొట్టిన బి గోపాల్ కొన్ని సినిమాల వల్ల మొత్తం కెరీర్ ను నాశనం చేసుకున్నాడు. ముఖ్యంగా ఈయన తెరకెక్కించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఆయన అప్పటి వరకు తెచ్చుకున్న పేరును పోయేలా చేసింది.
బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో అతి ఏ స్థాయిలో ఉందంటే అదే సినిమా ఇప్పుడు వస్తే ప్రతి సీన్ కు వేలకు వేల మీమ్స్ వచ్చేవి. ప్రతి సీన్ కు ట్రోల్స్ పడేవి. కోడికి కత్తి కట్టి మనిషిని చంపించడం.. తొడ కొడితే రైలు ఆగడం లాంటివి ఆ సినిమాలో ఎన్నో ఉన్నాయి. బాలకృష్ణ తో ఏం చేయించినా నడుస్తుందనుకుని బి గోపాల్ అలా చేశాడు. కాని అవి కాస్త రివర్స్ అయ్యాయి. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పాటు బాలయ్య మరియు గోపాల్ ల పరువు పోయేలా చేసింది.
తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో బి గోపాల్ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా గురించి ప్రస్తావన రావడంతో సినిమాలో తొడ కొడితే ట్రైన్ ఆగే సీన్ ను పెట్టకుండా ఉండాల్సింది. ఆ సీన్ గురించి ఇప్పటికి నేను బాధ పడుతూనే ఉంటాను. తప్పు చేశాను అనే భావన నాలో ఉందని గోపాల్ చెప్పుకొచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ కు పూర్తి బాధ్యత తనదే అంటూ బి గోపాల్ చెప్పుకొచ్చాడు.