Begin typing your search above and press return to search.

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కావల్సిందే!!

By:  Tupaki Desk   |   12 Jan 2016 3:30 PM GMT
కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కావల్సిందే!!
X
చంటిగాడు - ప్రేమికులు - ల‌వ్ లీ వంటి మూవీస్‌ని తెర‌కెక్కించారు లేడీ డైరెక్ట‌ర్ బి.జ‌య‌. కమర్షియల్‌ గా భారీ హిట్లు పడకపోయినా.. మూవీ మేకర్‌ గా పర్వాలేదనే అనిపించుకున్నారు. లేటెస్టుగా 'వైశాఖం' అనే చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే కాస్టింగ్ సెల‌క్ష‌న్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం న‌టీన‌టులకు న‌ట‌శిక్ష‌ణ ఇస్తున్నారు. ఇలా శిక్ష‌ణ‌నివ్వ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కూ అన‌వ‌స‌ర ఖ‌ర్చును త‌గ్గించ‌వ‌చ్చ‌ని, ఆర్టిస్టుల్లో పెర్ఫెక్ష‌న్‌ ని చూపించ‌గ‌ల‌మ‌ని అంటున్నారు జయ.

ల‌వ్‌ లీ చిత్రంలో శాన్వి క‌థానాయిక‌గా న‌టించింది. ఏరి కోరి ఈ క్యూట్ ఢిల్లీ గాళ్‌ ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఢిల్లీ గాళ్‌ నే క‌థానాయిక‌గా ఎంపిక చేసుకున్నాన‌ని చెప్పారు. ప్రస్తుతానికి అమ్మాయి ఎవరనేది సీక్రెట్‌. ఇకపోతే ఈ సినిమా కాన్సెప్టు గురించి చెబుతూ.. ''ఈ రోజుల్లో ఫ్యామిలీ క‌ల్చ‌ర్ అంత‌రించి పోయింది. ఎవ‌రికి వారే విడిపోయి విడిగా ఉంటున్నారు. కుటుంబ అనుబంధాలు - ఆప్యాయ‌త‌లు క‌నుమ‌రుగైపోయాయి. ఒకే అపార్ట్‌ మెంట్‌ లో ఉంటూనే పేరెంట్స్ వేరుగా, పిల్ల‌లు వేరుగా ఉంటున్నారు. అలాంటి అపార్ట్‌ మెంట్ స్టోరీనే తెర‌కెక్కిస్తున్నా. అస‌లు ఇలాంటి లైఫ్ స్ట‌యిల్ వ‌ల్ల ఏం కోల్పోతున్నారు అన్న‌ది చూపిస్తున్నాం'' అని చెప్పారు.

ఇండ‌స్ర్టీ మ్యాట‌ర్స్ గురించి మాట్లాడుతూ.. మ‌న ఇండ‌స్ర్టీని కాంబినేష‌న్లు, క‌మ‌ర్షియాలిటీ న‌డిపిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ హిట్ వ‌స్తేనే అవ‌కాశాలు ఉటాయిక్క‌డ‌. ఓ మంచి క‌థ వినిపించాల‌ని వెళితే కచ్ఛితంగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ గురించి, కాంబినేష‌న్ల గురించి మాట్లాడుతారు. అందుకే ఇక్క‌డ ఛాలెంజ్‌ ని ఎదుర్కోవ‌డం చాలా క‌ష్టం.. అంటూ ఆమె చెప్పారు. అది సంగతి.