Begin typing your search above and press return to search.
నాగార్జునతో మూవీ అందుకే ఆలస్యం?
By: Tupaki Desk | 8 Jan 2016 5:30 AM GMTకింగ్ నాగార్జున ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు. నవతరం ట్యాలెంటును ఎంకరేజ్ చేస్తూ సక్సెస్ ఎలా అందుకోవాలో తనకి బాగా తెలుసు. నాగచైతన్య... సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించినా, చందు మొండేటి దర్శకత్వంలో(ప్రేమమ్ రీమేక్) నటిస్తున్నా.. అదంతా అతడి పాజిటివ్ యాటిట్యూడ్ వల్లనే. అంతెందుకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కళ్యాణ్ కూడా ఓ కొత్త దర్శకుడే. ఇన్నోవేటివ్ ఐడియాతో తన వద్దకు రావాలే కానీ ఛాన్సివ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే.
ట్యాలెంటును వెతికి పట్టుకుని మరీ అవకాశాలిస్తుంటారు కింగ్. అయితే అప్పట్లో లవ్ లీ మూవీతో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకురాలు బి.జయకు ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు. ఓ మంచి కథ ఉంటే చెప్పండి.. ఓకే చేసేస్తానని బహిరంగంగానే ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకు కారణమేంటి? అని ప్రశ్నిస్తే మహిళా దర్శకురాలు క్లారిటీ ఇచ్చారిలా..
అప్పట్నుంచి సరైన కథ కోసం వెతుకుతున్నా .. నాగార్జునని ఇంతకుముందు ఎవరూ చూపించనంత కొత్తగా చూపించాలి. ఆ రేంజులో స్ర్కిప్టు కావాలి. అందుకోసమే వేచి చూస్తున్నా. అవకాశం ఇచ్చారు కదా.. అని ఏదో ఒకటి చేసేద్దాం లే అని ముందడుగు వేయలేదని బి.జయ అన్నారు. కింగ్ ని కొత్తగా చూపించేలా ఇన్నోవేటివ్ స్ర్కిప్టు దొరికినప్పుడు నేరుగా వెళ్లి ఒప్పిస్తాను. ప్రస్తుతానికి స్క్రిప్టు విషయంలో పూర్తి సంతృప్తి చెందలేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందని బి.జయ చెప్పారు. ప్రస్తుతం నవతరం నటీనటులతో వైశాఖం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇండస్ర్టీ టాప్ పీఆర్ వో - సూపర్ హిట్ అధినేత బి.ఎ.రాజు నిర్మిస్తున్నారు. ఇప్పుడర్థమైందా కింగ్ తో ప్రాజెక్టు ఎందుకాలస్యమో?