Begin typing your search above and press return to search.

మిస్సమ్మ పెద్ద నిర్మాత మనవడు కరోనాతో మృతి

By:  Tupaki Desk   |   24 Jun 2020 6:00 PM GMT
మిస్సమ్మ పెద్ద నిర్మాత మనవడు కరోనాతో మృతి
X
ప్రపంచానికి ఒక గొప్ప గుణపాఠాన్ని కరోనా నేర్పింది. ఇప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు.. ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నదే ముఖ్యం.. పైసల కన్నా ప్రాణం గొప్పదని కరోనా చాటిచెప్పింది. ఇందులో రాజు లేడు పేద లేడని నిరూపించింది. అందరూ తన ముందు సమానమేనన్న గొప్ప నీతిని చెప్పింది.

విజయ వాహిని స్టూడియో..ఎన్టీఆర్, ఏఎన్నార్ లు చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి ముందు ఈ స్టూడియో చుట్టే చెప్పులు అరిగేలా అవకాశాల కోసం తిరిగారు. సినిమాలు మొదలైన కొత్తలో ఏర్పడ్డ సినీ సంస్థ ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగినది. ఇది అప్పట్లో ఆసియాలో అతిపెద్ద చలన చిత్ర స్టూడియోగా పేరుగాంచింది.. చెన్నై నగరంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాత బి నాగి రెడ్డి దీని సృష్టికర్త. ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు, మిస్సమ్మ, మాయ బజార్, రామ్ శ్యామ్, గుండమ్మ కథ, మదువే మదీనోడు, శ్రీమాన్ శ్రీమతి, జూలీ, పాతాళ భైరవి మరియు స్వర్గ్ నరక్, విజయ స్టూడియో బ్యానర్ లో చరిత్రలో నిలిచిన సినిమాలుగా కీర్తిని పొందాయి.

చెన్నై విజయ ఆసుపత్రి చైర్మన్ మిస్టర్ బి. విశ్వనాథారెడ్డి కుమారుడు శరత్ రెడ్డి (విజయ హాస్పిటల్ బోర్డు డైరెక్టర్) తాజాగా కరోనావైరస్ తో పోరాడుతూ నిన్న చెన్నైలో కన్నుమూశారు. ఇతడు సినీ నిర్మాత బి. నాగి రెడ్డి మనవడు కావడం గమనార్హం.

శరత్ రెడ్డి విజయ వాహిని స్టూడియోలను మూసివేసి, చెన్నైలో విజయ హాస్పిటల్ మరియు విజయ హెల్త్ కెర్ సెంటర్ ను స్థాపించాడు. శరత్ రెడ్డి వయసు 43 సంవత్సరాలు. ఇతను విశ్వనాథారెడ్డి కుమారుడు. కొద్ది రోజుల క్రితం కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న అతన్ని చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

శరత్ రెడ్డి సొంతంగా ఎంతో పెద్దదైన కార్పొరేట్ ఆసుపత్రిని కలిగి ఉన్నప్పటికీ కరోనావైరస్ నుండి తప్పించుకోలేకపొయారు.ఈ టైంలో ఎంత ఆస్తి ఉన్నా.. ఎన్ని కోట్లు ఉన్నా జాగ్రత్తలు పాటించకపోతే ఎంతవారికైనా చావు తప్పదు అని ఈ సంఘటన రుజువు చేసింది.