Begin typing your search above and press return to search.
బర్త్ డే మారాజు... బీఏ రాజు
By: Tupaki Desk | 7 Jan 2018 4:50 AM GMT*కష్టే ఫలి* అంటారు కదా....
దీనిని తిరగారిసన వారు ఒకరున్నారు
ముందు ఏం తిరగరాశారో చెప్పండి అంటారా? ఓకే!
*ఇష్టే ఫలి !
అరే భలే ఉందే.. ఇపుడు స్టోరీ చెప్పండి అంటారా? రండి చెబుతా!
అతనికి ఆ పని చేయమని ఎవరూ చెప్పలేదు, కానీ చాలా ఇష్టంగా చేశాడు.. మనం ఇష్టపడి చేసిన ఏ పని అయినా చాలా బాగా చేస్తాం. అవసరానికి మించి కష్టపడతాం - సరిహద్దులు దాటి స్మార్ట్ గా ఆలోచిస్తాం - సరిగ్గా అలాగే తనకు ఇష్టమైన సినిమాలను వాటి ఫలితాలను బుద్ధిగా - చక్కగా... ఇష్టంగా ఓ కృష్ణా జిల్లా కుర్రాడు అంచనా వేసి ఫిలింనగర్ కు పంపుతుండే వాడు. జ్యోతిషం చెప్పినట్టు అతను హిట్టన్న సినిమాలన్నీ హిట్టయ్యేవి. ఫట్ అయ్యే వాటి గురించి కూడా చెప్పే వాడు. అవి నిజంగానే పోయేవి. ఆ అనామక కుర్రాడు ఇష్టంతో చేసిన పని ఫలించింది. అతని రిపోర్టులు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణకు చేరాయి. అంతే పిలిస్తే ఫిలిం నగర్ లో సెటిల్ అయిపోయాడు.
ఎంతో మంది ఫిలింనగర్ కు వస్తుంటారు పోతుంటారు... కానీ బీఏ రాజు లోకల్. నిజమే... ఎందుకంటే మూడు తరాలు ఆయన ముందు మారిపోయాయి. ఈ కొత్త జనరేషన్ లోనూ ఆయన హవా తగ్గలేదు. ఎందుకో తెలుసా..
ఆయన మాట మంచిది
ఆయన చేయి మంచిది
ఆయన పరిచయం మంచిది
అసలు సిసలు పీఆర్వో... ట్రెండులో వచ్చే కొత్త మీడియా మార్గాలను అలవరుచుకుంటారు. పాత పద్ధతిని ఏదీ మానేయరు. అన్ని నదులను కలుపుకునే సముద్రంలాగా అన్ని రకాల మీడియాలు బీఏ రాజును కలుస్తుంటాయి. బీఏ రాజు ఉత్తి పీఆర్వో కాదు... ఎన్ సైక్లో పీడియా - వారధి - నిర్మాత - ట్రబుల్ సూటర్ ! ఆయనది ఒక డిఫరెంట్ లెవెల్ అందుకే టాప్ హీరోకు నచ్చుతాడు... కొత్తగా పుట్టిన వెబ్ సైటు ప్రతినిధికి నచ్చుతాడు.
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ పిఆర్ ఓ గా చరిత్ర సృష్టించిన ఏకైక వ్యక్తి - శక్తి బిఏ రాజు. అన్ని మీడియాల ఫిలిం జర్నలిస్ట్ లందరితో మమేకం అవుతూ చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా అందరు జర్నలిస్టులను - అన్ని మీడియా సంస్థల ప్రతనిథులను సమదృష్టి తో చూసే ఏకైక నావికుడు బీఏరాజు. గిన్నిస్ బుక్ ను సంప్రదించలేదు గాని వెయ్యి సినిమాలకు పైగా పీఆర్వో గా చేసిన ఇండివిడ్యువల్ గా వరల్డ్ రికార్డు మాత్రం ఆయనదే ముమ్మాటికీ... అందరికీ ఆప్తుడైన ఆయనకు Tupaki.com టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు!