Begin typing your search above and press return to search.

అదరహో అనిపించిన బాద్షాహో

By:  Tupaki Desk   |   13 Jun 2017 4:35 PM GMT
అదరహో అనిపించిన బాద్షాహో
X
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇప్పుడు ఫుల్లు ఫాంలో ఉన్నాడు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. సింగం నుంచి మొదలుపెట్టి హిట్స్ కొడుతూనే ఉన్న అజయ్.. ఏడాదికో సినిమా చొప్పున విడుదల చేస్తూ.. ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో తన మూవీని నిలుపుతున్నాడు. గతేడాది శివాయ్ తో సంబరాలు చేసుకున్న ఈ స్టార్ హీరో.. ఇప్పుడు బాద్షాహో అంటూ దూసుకొస్తున్నాడు.

చోరీ చోరీ.. వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై.. వంటి చిత్రాలను రూపొందించిన ట్యాలెంటెడ్ దర్శకుడు మిలన్ లూథ్రియా.. బాద్షాహోకు దర్శకుడు కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ముందు నుంచి విపరీతమైన హైప్ ఉన్న ఈ సినిమాకు.. ఇప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకుని.. ముఖానికి కర్చీఫ్ కట్టుకుని.. బ్లాక్ ఓవర్ కోట్ లో స్టైలిష్ గా ఉన్న అజయ్ దేవగన్ పోస్టర్ అదరహా అనిపించేలా ఉంది. హీరో కూడా కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించనున్నాడు. 48 ఏళ్ల వయసులోనూ అజయ్ దేవగన్ యంగ్ లుక్ సూపర్బ్ గా ఉన్నాడు.

సెప్టెంబర్ 1న బాద్షాహో రిలీజ్ కానుందనే విషయం ఇప్పటికే ప్రకటించగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మరోసారి కన్ఫాం చేశారు. ఈ చిత్రంలో ఇలియానా.. ఈషా గుప్తా హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ- విద్యుత్ జమాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/