Begin typing your search above and press return to search.
తెలుగోళ్లకి తప్ప అందరికీ తెగ నచ్చింది
By: Tupaki Desk | 23 Feb 2018 5:57 AM GMTటైగర్ ష్రాఫ్.. దిశాపటానీ జంటగా నటించిన మూవీ బాఘీ2. ఈ రియల్ లైఫ్ లవర్స్ ఇద్దరూ.. తొలిసారిగా కలిసి నటించిన చిత్రానికి ట్రైలర్ కూడా వచ్చేసింది. టాలీవుడ్ మూవీ క్షణంను.. అదిరిపోయే యాక్షన్ మూవీగా మార్చి తెరకెక్కించారు మేకర్స్.
బాఘీ2 ట్రైలర్ ఇంటర్నెట్ లో సెన్సేషన్స్ సృష్టిస్తోంది. ఇప్పటివరకూ ఈ ట్రైలర్ కు 15 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే.. ఏ రేంజ్ లో జనాలు దీన్ని మెచ్చారో అర్ధమవుతుంది. ఇండియన్ రాంబో మాదిరిగా టైగర్ ష్రాఫ్ చేసిన యాక్షన్ ఫీట్స్ ట్రైలర్ లో హైలైట్ అవుతున్నాయి. మరోవైపు దిశా పటానీ కూడా తన గ్లామర్ తో కుర్రకారును బాగానే ఆకట్టుకుంది. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి ఇంతటి యాక్షన్ ఎపిసోడ్స్ ను చూడడం తొలిసారి కావడంతో అందరూ మెస్మరైజ్ అవుతున్నారు. అందుకే ఈ స్థాయిలో వ్యూస్ వచ్చిపడుతున్నాయి.
కానీ టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం బాఘీ2 ట్రైలర్ ను తిట్టిపోస్తున్నారు. అసలే మాత్రం కనెక్ట్ కాలేకపోతున్నారు. ఇందుకు కారణం.. ఇక్కడ ఆ చిత్రాన్ని ఓ సెన్సిబుల్ స్టోరీగా చూసి ఉండడమే. నిస్సహాయ స్థితిలో ఉన్న తన మాజీ లవర్ ఆదా శర్మకు సాయం చేసేందుకు వచ్చిన అడివి శేష్ పాత్ర.. సింపుల్ గానే ఉంటుంది. సస్పెన్స్ ఎలిమెంట్ ను బేస్ చేసుకుని కథ అంతా నడుస్తుంది. కానీ బాలీవుడ్ లో దీన్ని యాక్షన్ జోనర్ లోకి ఛేంజ్ చేసేశారు. వాళ్లకు ఒరిజినల్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి.. బాఘీ తెగ నచ్చేసింది.