Begin typing your search above and press return to search.

వర్షం రీమేక్ కి ఫస్ట్ లుక్ వచ్చింది

By:  Tupaki Desk   |   9 March 2016 4:52 AM GMT
వర్షం రీమేక్ కి ఫస్ట్ లుక్ వచ్చింది
X
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - త్రిష జంటగా గోపీచంద్ విలన్ గా తెలుగులో సూపర్ హిట్ సాధించిన వర్షం మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ బాలీవుడ్ మూవీలో టైగర్ ష్రాఫ్ - శ్రద్ధా కపూర్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. టాలీవుడ్ హీరో - మహేష్ బాబు బావ సుధీర్ బాబు విలన్ గా కనిపించనున్నాడు. బాఘీ: రెబెల్స్ ఇన్ లవ్ పేరుతో ఈ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కుతోంది.

ఈ బాఘీ చిత్రానికి ఇప్పుడు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. సిక్స్ ప్యాక్ అనే స్థాయి కంటే రెండు అడుగులు ఎక్కువగానే పర్ఫెక్ట్ జిమ్ బాడీతో టైగర్ ష్రాఫ్ కనిపిస్తుండగా, ఒయ్యారాలు ఒలకబోస్తున్న హీరోయిన్ గా శ్రద్ధా కనిపిస్తోంది. రొమాంటిక్ మూడ్ తో కాకుండా.. సీరియస్ అనిపించేలా బ్యాక్ గ్రౌండ్ డిజైన్ చేసి పోస్టర్ విడుదల చేశారు. సూపర్బ్ అనే టాక్ రాకపోయినా, డిఫరెంట్ గా కనిపిస్తోందనే మాట వినిపిస్తోంది.

అయితే టాలీవుడ్ జనాలకు ఈ పోస్టర్ అంతగా ఎక్కలేదు. మూవీలో కూడా హీరోయిన్ పాత్రను పోషించే శ్రద్ధా కపూర్ లుక్ ఓకే అనిపించినా.. హీరోని కండలవీరుడిగా చూపించడంపై పెద్దగా కిక్ రావడం లేదంటున్నారు. ప్రభాస్ పర్సనాలిటీ కూడా ఈ రేంజ్ లోనే ఉన్నా.. వస్తాదు టైప్ లుక్ సినిమాకి అవసరం లేదన్న విషయం ఇక్కడి జనాలకు తెలుసు. అయితే బాలీవుడ్ స్టైల్ కి తగ్గట్లుగా మార్పులు ఉంటాయని చెబ్తుండడంతో.. బాఘీకి ఈ ఫస్ట్ లుక్ ఇచ్చారని యూనిట్ వర్గాలు అంటున్నాయి.