Begin typing your search above and press return to search.

వర్షం సినిమా పరువు తీసిపాడేశారు

By:  Tupaki Desk   |   30 April 2016 4:12 AM GMT
వర్షం సినిమా పరువు తీసిపాడేశారు
X
వర్షం సినిమా అంటేనే మనకు గుర్తొచ్చేది.. 'మెల్లగా కరుగనీ.. రెండు మనసుల దూరం' అంటూ సాగే రొమాన్స్‌. తన యాక్టింగ్‌ తో త్రిష ఉతికి ఆరేస్తే.. తన హ్యండ్సమ్‌ లుక్‌ అండ్ మ్యాన్లీ ఫైట్లతో ప్రభాస్‌ కూడా పిండేశాడు. అంతే కాదు.. విలన్‌ అంటే ఒక ట్రేడ్‌ మార్కు బాడీ లాంగ్వేజ్‌ ను సెట్‌ చేశాడు గోపీ చంద్‌. ఇక ఇదే సినిమాను హిందీలో తీస్తే ఎలా ఉందో తెలుసా?

బాలీవుడ్‌ దర్శకుడు సబ్బీర్‌ ఖాన్‌ ఒకరోజు 'వర్షం' సినిమా డివిడి చూస్తూ ఉండుంటాడు. ఎక్కడో ముంబయ్‌ సందుల్లో కొన్న పైరేటెడ్‌ డివిడి.. ఇంటర్వెల్‌ వరకు ప్లే అయ్యి ఆగిపోయుంటుంది. ఆ తరువాత అప్పటికే స్టార్‌ మూవీస్‌ ఛానల్ లో వస్తున్న 'రెయిడ్‌ రిడెంప్షన్‌' సినిమా సగం నుండి చూశాడు. బ్రెయిన్‌ లో ఓ ఐడియా మెరిసింది. వర్షం ఫస్టు హాప్‌ అండ్‌ రెయిడ్‌ రిడెంప్షన్‌ సెకండాఫ్‌ కలిపేసి ఓ కిచిడీ చేస్తే? అదిగో అదే ''బాగీ'' సినిమా. నటన కాస్త కూడా రాని టైగర్‌ ష్రాఫ్‌ అండ్‌ శ్రద్దా కపూర్‌.. రొమాన్స్‌ పలికించండి అంటే కేవలం ఇకిలిస్తూ నుంచొని.. వర్షం ఫస్టాఫ్‌ ను చక్కగా పాడు చేశారు. సెకండాఫ్‌ అయితే థాయ్‌ నూడుల్స్‌ తిన్నట్లే ఉంటుంది. అదేదో మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాను తీశాడు. అనవసరంగా మన 'వర్షం' సినిమా పరువుపోయింది.

ప్రభాస్‌ అండ్‌ త్రిష కాంబినేషన్ లో దివంగత శోభన్‌ రూపొందించిన ''వర్షం'' సినిమా అభిమానులు మాత్రం.. పొరపాటున కూడా ''బాగీ'' ధియేటర్ల జోలికి వెళ్ళకండి ప్లీజ్‌. తరువాత కుమిలిపోతారు. ఒకవేళ శ్రద్దా కపూర్‌ బికినీ సాంగ్‌ చూడాలంటే.. యుట్యూబ్‌ లో చూడండి. ఇక్కడా అక్కడా యాజిటీజ్‌ అదే పాట ఉంది.