Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: ఇదేం వర్షం బాబా!!
By: Tupaki Desk | 14 March 2016 1:07 PM GMTతెలుగులో సూపర్ హిట్ అయిన వర్షం సినిమాను హిందీలో బాఘీ అంటూ రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ హిందీ వర్షం ట్రైలర్‌ను చూస్తే మాత్రం.. అసలు ఇదేం వర్షం నాయనో అనిపించక మానదు. ఎందుకంటే ఇది బ్యాంకాక్ లో తీసిన టోనీ జా ఓంగ్ బ్యాక్ సినిమాల టైపులో ఉంది మరి.
ఈరోజు విడుదలైన బాఘీ ట్రైలర్ ను చూస్తే.. కేవలం బేసిక్ స్టోరీ లైన్ మాత్రమే వర్షం సినిమా నుండి తీసుకున్నారని అర్ధమవుతోంది. ఒక వర్షంలో హీరోయిన్ శ్రద్దా కపూర్ ను బికినీ అందాల్లో చూసి హీరో ఫ్లాటైపోయాడు. అతడి పేరు రానీ (టైగర్ ష్రాఫ్) - ఆమె పేరు శియా (శ్రద్దా కపూర్). అదే సమయంలో రాఘవ (సుధీర్ బాబు.. అవును మనోడే) కూడా ఆమెను చూసి ఫ్లాటయ్యాడు. చాలా రోజుల తరువాత ఎవరో శియాను బ్యాంకాక్ లో కిడ్నాప్ చేశారని న్యూస్ రావడంతో ఆమెను విడిపించడానికి అక్కడికి వెళ్తాడు రాని. ఇది వర్షం కదే. కాకపోతే సినిమా అంతా కరాటే ఫైట్లు.. కరాటే స్టంట్లు.. మార్షల్ ఆర్ట్స్ తాలూకు సెగలు.. వగలు.. అమ్మో చాలా ఉన్నాయి. అందుకే ఇది చైనీస్ అండ్ థాయ్ మార్షల్ ఆర్ట్స్ సినిమాలా ఉంది. శ్రద్దా హాట్ లుక్ బాగుంది. టైగర్ మార్షల్ ఆర్ట్స్ కూడా పర్లేదు కాని డోస్ ఎక్కువైంది. సుధీర్ బాబు బలే ఉన్నాడులే.
తెలుగు వర్షం అయితే అత్యంత ప్రియమైన మృదువైన తీయనైన ప్రేమ కావ్యం. మరి హిందీ వర్షాన్ని ఇలా కరాటే కావ్యం చేసేస్తే.. వారు చూస్తారా? అందుకే అనేది.. ఇదే వర్షంరా బాబా అని.