Begin typing your search above and press return to search.
‘మెగా’ బ్రాండుకు బాహుబలి పంచ్
By: Tupaki Desk | 12 May 2017 6:00 AM GMTచిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాక ఇండస్ట్రీ రికార్డులన్నీ ఎప్పటికప్పుడు ఆయన పేరు మీదే ఉంటుండేవి. ఎవరైనా ఆ రికార్డుల్ని బద్దలు కొట్టినా.. వాటిని మళ్లీ చిరునే బద్దలు కొట్టేవాడు. చిరు ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించడాని కంటే ముందే పవన్ పీక్స్ అందుకుని అతనూ రికార్డుల మోత మోగించడం మొదలుపెట్టాడు. మరోవైపు రామ్ చరణ్.. అల్లు అర్జున్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వాళ్ల స్థాయిలో వాళ్లు హవా సాగించడం మొదలుపెట్టారు. దీంతో చిరు ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించినా మెగా ఫ్యామిలీ ఆధిపత్యానికి ఢోకా లేకపోయింది. మగధీర.. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్లు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాయి. కానీ దశాబ్దాలుగా సాగుతున్న మెగా ఫ్యామిలీ హవాకు ‘బాహుబలి’ వచ్చి బ్రేక్ వేసేసింది. ‘బాహుబలి’ రెండు భాగాలూ కొత్త చరిత్రను లిఖించాయి.
‘బాహుబలి: ది బిగినింగ్’ డే-1 కలెక్షన్ల రికార్డుతో పాటు కొన్ని ఏరియాల్లో ఆ సినిమా లైఫ్ టైం కలెక్షన్లను ‘ఖైదీ నెంబర్ 150’ బద్దలు కొట్టిందని మెగా అభిమానులు సంబరపడినా.. ఆ సంబరం ఎన్నో రోజులు నిలవలేదు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చి మెగా ఫ్యామిలీ టచ్ చేయలేని రికార్డులకు తెర తీసింది. ఇది మెగా ఫ్యామిలీ ఆధిపత్యానికి సవాలే. ‘బాహుబలి’ వల్ల ‘మెగా’ బ్రాండు దెబ్బ తిన్న నేపథ్యంలో మళ్లీ తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నంలో పడింది ఆ ఫ్యామిలీ. ఓవైపు చిరంజీవి హీరోగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ లాంటి చారిత్రక నేపథ్యమున్న సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. మరోవైపు అల్లు అరవింద్ రూ.500 కోట్లతో రామాయణం అంటున్నాడు. ఈ సినిమాలు మెగా ఫ్యామిలీ ఆధిపత్యాన్ని మళ్లీ చాటిచెబుతాయని.. ‘బాహుబలి’ జనాల దృష్టిని మళ్లిస్తాయని ఆశిస్తున్నారు. మరి వాళ్ల ఆశ నెరవేరుతుందేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/