Begin typing your search above and press return to search.

రచ్చలో కూడా రచ్చ రచ్చ చేస్తున్నాం..

By:  Tupaki Desk   |   8 Sep 2015 8:01 AM
రచ్చలో కూడా రచ్చ రచ్చ చేస్తున్నాం..
X
గత మూడు నాలుగు నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మహర్దశ పట్టింది. దాదాపు తాను పట్టిందల్లా బంగారంగా మారుతుంది. తక్కిన ఇండస్ట్రీ వారంతా మన తెలుగు సినిమా ఏ నక్క తోక తొక్కిందా అని ఆశ్చర్యపోతున్నారు. బాహుబలితో ప్రపంచ రికార్డులను సృష్టించుకున్న మన సినిమా ఆ తరువాత శ్రీమంతుడి ద్వారా మరో మెట్టుకి ఎదిగింది. రవితేజ తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ కిక్ 2 ద్వారా సాధించాడు. ఇక నాని సైతం భలేగా అందరినీ నవ్విస్తున్నాడు.

అయితే ఈ విజయాలు సౌత్ వరకే పరిమితం కాకుండా విదేశాలలో కూడా మన జెండా పాతడం ఆనందకరం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్న మన సిద్ధాంతాన్ని ఈ సినిమాలు నిజం చేసాయి. బాహుబలి, శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్ సినిమాలకు ఓవర్ సీస్ లో అద్భుతమైన క్రేజ్ ఏర్పడడంతో అక్కడ కూడా తెలుగు సినిమాల పై అంచనాలు పెరిగాయి.

మన సినిమాలు అదిరిపోయే రేంజ్ లో వుండడంతో పాటూ మిగిలిన భాషా చిత్రాలు నిరాశపరచడం మనకు కలిసివచ్చింది. భాజరంగీ భాయ్ జాన్ తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిన మరో బాలీవుడ్ చిత్రం రాకపోవడం గమనార్హం. హాలీవుడ్ లో సైతం 'మిషన్ ఇంపాజిబుల్' మినహా హిట్ సినిమాలు లేవు. వీటన్నింటి కారణం చేత కూడా మన తెలుగు సినిమాలకు అక్కడ మార్కెట్ పెరగడం శుభసూచకం.