Begin typing your search above and press return to search.
బాలీవుడ్ కి బాహుబలి కొత్త బెంచ్ మార్క్!
By: Tupaki Desk | 20 May 2017 2:49 PM GMTబాలీవుడ్ లో ఇప్పటివరకూ ఏ సినిమా కూడా 400 కోట్ల రూపాయల నెట్ వసూళ్ల మార్క్ ను అందుకోలేదు. గత నెలవరకూ అగ్రస్థానంలో ఉన్న పీకేను బాహుబలి2 ఎప్పుడో దాటేసి.. పరుగులు తీసేసింది. 400 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించేసి పరుగులు పెడుతూనే ఉంది.
విడుదలైన 22 రోజులకు బాహుబలి2 హిందీ వెర్షన్ ఇండియా నెట్ వసూళ్లు రూ. 460 కోట్లు. 22 వ రోజుల వసూలు చేసిన మొత్తమే 4 కోట్లు. ఈ 22 రోజుల పాటు ప్రతీ రోజుకు సంబంధించిన హైయెస్ట్ కలెక్షన్ వసూళ్లు బాహుబలి పేరిటే ఉన్నాయి. ఇప్పుడు 460 కోట్ల మార్క్ ను అందుకున్న బాహుబది ది బిగినింగ్.. శని ఆది వారాల్లో మరింత మొత్తాన్ని కలెక్ట్ చేయడం ఖాయం. ఫుల్ రన్ లో ఈ సినిమా హిందీ వెర్షన్ ఖచ్చితంగా 500 కోట్ల మార్క్ ను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి ఇంకా డిమాండ్ పీక్ స్టేజ్ లో ఉండడమే ఇందుకు కారణం.
కొత్త సినిమాలు వస్తున్నా బాహుబలి2 స్థాయి తగ్గకపోవడం విశేషం. ఈ శుక్రవారం విడుదలైన హాఫ్ గాళ్ ఫ్రెండ్ కు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. అది కూడా బాహుబలి2 వసూళ్లను ఏ మాత్రం ప్రభావింత చేయలేకపోయింది. మరోవైపు ఓవర్సీస్ లో ఆదివారం నాటికి ఈ చిత్రం 20 మిలియన్లను వసూలు చేయనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/