Begin typing your search above and press return to search.
బాహుబలి-2.. 7 వేల స్క్రీన్లు.. 2.5 లక్షల డాలర్లు
By: Tupaki Desk | 3 May 2018 6:18 AM GMT‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజై ఏడాది దాటిపోయింది. ఇంత కాలానికి చైనాలో విడుదల కాబోతోందా చిత్రం. ‘బాహుబలి: ది బిగినింగ్’ను చైనాలో రిలీజ్ చేయడంలో ఆలస్యం చేశామని.. రెండో భాగం విషయంలో అలా జరగనివ్వబోమని నిర్మాత శోభు యార్లగడ్డ అన్నాడు కానీ.. ఆలస్యాన్ని ఆయన కూడా ఆపలేకపోయాడు. ఒక దశలో ఈ చిత్రం చైనాలో విడుదలవుతుందా అన్న సందేహాలు కూడా కలిగాయి కానీ.. ఎట్టకేలకు ఈ చిత్రం ఈ శుక్రవారమే చైనాలోని థియేటర్లలో దిగబోతోంది. ‘బాహుబలి-1’తో పోలిస్తే ఈ చిత్రానికి థియేటర్ల సంఖ్య కొంచెం తక్కువగానే అనిపిస్తోంది. తొలి భాగాన్ని 8 వేల థియేటర్లలో రిలీజ్ చేసినట్లు చెప్పారు. ‘బాహుబలి-2’కు దక్కిన స్క్రీన్లు 7 వేలే. ఐతే నంబర్ తగ్గినా ఈసారి మంచి స్క్రీన్లు ఇచ్చినట్లు అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘బాహుబలి: ది బిగినింగ్’ చైనాలో నామమాత్రపు వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో రెండో భాగం ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుందా అనుకున్నారు. కానీ ప్రి రిలీజ్ బజ్ బాగానే ఉన్నట్లుంది. ఈ చిత్రానికి ఇప్పటిదాకా 2.5 మిలియన్ డాలర్ల ప్రి రిలీజ్ సేల్స్ జరగడం విశేషం. తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్ ప్రకారం చూస్తే ఈ ప్రి సేల్స్ బెటర్ అనే చెప్పాలి. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో.. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. బాలీవుడ్ సినిమాల రేంజిలో అయితే చైనాలో ఇది జోరు చూపిస్తుందన్న అంచనాలైతే లేవు. ‘బాహుబలి’ తరహా ఫాంటసీ-వార్ సినిమాలు చైనాలో కొత్తేమీ కాదు. కాబట్టే ‘దంగల్’ లాంటి సినిమాల మాదిరి దీన్ని ఆదరించే పరిస్థితి లేదు. ఐతే చైనా కంటే ముందు జపాన్ లో విడుదలైన ఈ చిత్రం అక్కడ మాత్రం బాగానే ఆడింది. ఇటీవలే అక్కడ ఈ చిత్రం వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది.