Begin typing your search above and press return to search.

బాహుబలి పాచిక పారలేదు

By:  Tupaki Desk   |   6 May 2018 12:29 PM IST
బాహుబలి పాచిక పారలేదు
X
నువ్వు నీ దేశానికి రాజువేమో నాకు కాదు అన్నట్టు ఉంటుంది చైనా వాళ్ళ వ్యవహారం. భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించిన బాహుబలి 2 విజయం గురించి ఇప్పటికే కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. రికార్డుల గురించి రాసుకుంటూ పోతే ఒక పెద్ద పుస్తకం కూడా తయారవుతుంది. ప్రపంచమంతా ఆదరించిన బాహుబలి 2కి చైనాలో మాత్రం చుక్కెదురు అవుతున్నట్టు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం జపాన్ లో భారీ ఎత్తున విడుదల చేసి వసూళ్లు మూట గట్టుకున్న రాజమౌళి టీం అదే తరహా ఫలితాన్ని చైనాలో కూడా ఆశించారు. దానికి తగ్గట్టు వసూళ్లు మాత్రం రాకపోవడం టీంని షాక్ కి గురి చేస్తోంది. 7 వేల థియేటర్లలో బాహుబలి 2 విడుదల చేస్తే మొదటి రోజు 2.5 మిలియన్ డాలర్లు వచ్చాయి. అబ్బా సూపర్ అనకండి. ఇక్కడే ఉంది ట్విస్ట్. ఇర్ఫాన్ ఖాన్ లాంటి చిన్న నటుడు చేసిన హింది మీడియం చైనాలో మొదటి రోజు 3.42 మిలియన్ డాలర్లు రాబట్టింది. దానికి అయిన బడ్జెట్ జస్ట్ 4 కోట్లు. ఈ లెక్కన బాహుబలి 2 కు ఎంత రావాలి.

బాహుబలి 1 కూడా గతంలో చైనాలో ఆశించిన ఫలితం దక్కించుకోలేదు. దానికి కారణం ఒకటే. గ్రాఫిక్స్ తో కూడిన ఫాంటసీ డ్రామాలు చైనా వాళ్ళకు బోర్ కొట్టేసాయి. వాళ్ళ దగ్గరే లెక్క లేనన్ని సినిమాలు వచ్చాయి. అందుకే హిందిలో వస్తున్న ఎమోషనల్ డ్రామాస్ అంటే పడి చస్తున్నారు. ఇక్కడ జస్ట్ హిట్ అనిపించుకున్న అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ అక్కడ టాప్ 3లో నిలబడింది. దంగల్ 1400 కోట్ల దాకా రాబట్టింది. సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ ఏకంగా 8 వేల థియేటర్లలో విడుదల చేసారు. ఇవన్ని హంగులు లేని చాలా మామూలు ఎమోషనల్ స్టోరీస్. అందుకే వాళ్ళు బ్రహ్మ రధం పట్టారు. కాని బాహుబలి మాత్రం ఆ విషయంలో ఆకట్టుకోలేకపోయింది. ఇక చైనా మీడియా సైతం తక్కువ రేటింగ్స్ తో ఏమంత గొప్పగా లేదని బాహుబలి 2ని రివ్యూ చేయటం ఫైనల్ ట్విస్ట్. అయినా వదిలిన ప్రతి చోటా సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలన్న రూల్ ఏమి లేదుగా. సో బాహుబలికి చైనాలో మాత్రం వర్క్ అవుట్ కానట్టే