Begin typing your search above and press return to search.

బాహుబలి2.. మరో రికార్డ్ ఏంటో..

By:  Tupaki Desk   |   10 April 2018 2:30 PM GMT
బాహుబలి2.. మరో రికార్డ్ ఏంటో..
X
ఓ సినిమా దాదాపు దాదాపు 1500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించేసి అరుదైన ఘనతను సృష్టించేసిన తర్వాత.. ఆ మూవీ మరో కోటి సంపాదించింది అని చెబితే ఎలా ఉంటుంది.. వేరే ఎవరైనా చెబితే అంతో ఇంతో బాగుంటుందేమో కానీ.. బాహుబలి2 గురించి స్వయంగా ఆ చిత్ర నిర్మాతే చెబుతున్న రికార్డులు.. ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి.

బాహుబలి2 మూవీ కచ్చితంగా సంచలనమే. అలాగే ఈ చిత్రానికి జపాన్ లో కూడా మంచి స్పందన వచ్చింది. అది కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ వసూళ్లేమీ అంత గొప్పగా రాలేదనే మాట అయితే వాస్తవం. కానీ ఈ చిత్రం జపాన్ సినిమాలన్నిటినీ తల దన్నేసింది అనే స్థాయిలో శోభు యార్లగడ్డ ట్వీట్స్ పెడుతూ ఉంటారు. 'డిసెంబర్ 29న జపాన్ లో విడుదల అయిన బాహుబలి2.. ఇప్పుడు 15వ వారంలోకి చేరుకుంది. 100 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం 1.3 మిలియన్ల యూఎస్ డాలర్లను వసూలు చేసింది' అని ట్వీట్ పెట్టారు శోభు. 29th డిసెంబర్ రిలీజ్ అయితే.. మార్చ్ 3న 1 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. అంటే 9 వారాలలో ఆరున్నర కోట్ల రూపాయలు అనుకోవచ్చు.

ఆ తర్వాత ఐదు వారాలకు షుమారుగా 3 కోట్లొచ్చాయి. ఈ లెక్కన వారానికి 60 లక్షలు కూడా లేవన్న మాట. రోజుకు 10 లక్షలు కూడా కలెక్షన్స్ ను ఏ స్థాయిలోనూ ఈ సినిమా రాబట్టలేకపోయింది. ఆ రేంజు హిట్టును పట్టుకుని.. ఇంకా ఎందుకు బాహుబలి2 జపాన్ లో హిట్టు అంటున్నారో అర్ధం కాని విషయం. బహుశా అది చూపించి చైనా మార్కెట్ రిలీజ్ కోసమా అనే డౌట్స్ చాలా మంది వెలిబుచ్చుతున్నారు.