Begin typing your search above and press return to search.
బాహుబలి డబుల్ సెంచరీకి 4 బ్యాలెన్స్
By: Tupaki Desk | 13 Jun 2017 4:33 PM GMTబాహుబలి2 ఎన్నెన్నో కొత్త రికార్డులు సృష్టించేసిందనే విషయం తెలిసిందే. 800 కోట్ల నుంచి 1500 కోట్ల వరకూ గ్రాస్ కలెక్షన్స్ క్లబ్ లను అందుకున్న తొలి చిత్రం ఇదే. ఒక డబ్బింగ్ సినిమాలో కంటెంట్ బాగుంటే.. బాలీవుడ్ ఆడియన్స్ ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడతారో ప్రూవ్ చేసేసింది. ఖాన్ త్రయంతో సహా ఎవ్వరూ అందుకోలేని కొత్త రికార్డులను బాహుబలి2 హిందీ వెర్షన్ సెట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో అయితే కనీవినీ ఎరుగని వసూళ్లు బాహుబలి ది కంక్లూజన్ కు దక్కాయి. ఏపీ తెలంగాణ మార్కెట్ల వరకే లెక్కేసుకుంటే.. 100 కోట్ల షేర్ ను వసూలు సాధించగలిగిన సినిమా ఏదీ లేదు. కానీ బాహుబలి2 అంతకు రెట్టింపు మార్కుకు.. అంటే 2 రాష్ట్రాల్లోనే 200 కోట్ల షేర్ వసూళ్లకు చేరువైంది. కోస్తా ఏరియా నుంచి ఈ చిత్రానికి భారీ వాటా దక్కింది. ఇక్కడి నుంచి ఏకంగా 94 కోట్ల షేర్ కొల్లగొట్టింది. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకూ 196 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేయగలిగాడు బాహుబలి.
200 కోట్ల మార్కును అందుకునేందుకు బాహుబలి2 మూవీ ఇంకా 4 కోట్ల రూపాయల దూరంలో నిలిచింది. ఇప్పుడు ఈ మార్కును అందుకోవడం అసాధ్యం కాదు కానీ.. స్కూల్స్ తెరిచేయడంతో.. ఏడో వారం ముగిసిపోతున్న సమయంలో ఇప్పుడు ఇంత మొత్తాన్ని కలెక్ట్ చేయడం కష్టసాధ్యమే. ఇందుకు మరో 15 రోజులు అయినా పడుతుందని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అందుకోకపోయినా.. అసలు ఈ స్థాయి వరకూ వస్తుందనే ఎవరూ ముందుగా అంచనా వేయలేకపోయారనే మాట వాస్తవం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/