Begin typing your search above and press return to search.

ఇండియా నెం 1 .. 50 డేస్

By:  Tupaki Desk   |   15 Jun 2017 7:39 AM GMT
ఇండియా నెం 1 .. 50 డేస్
X
బాహుబలి ది కంక్లూజన్.. మన దేశమే గర్వించదగ్గ సినిమా అనడంలో సందేహం లేదు. ఓ ఇండియన్ మూవీ కలెక్షన్స్ సత్తా ఏంటో చూపించింది బాహుబలి2. కేవలం ఇండియా నుంచే ఈ చిత్రానికి 1200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రావడం గమనించాల్సిన విషయం.

ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అయితే ఈ సంఖ్య 1000కి పైగానే ఉండొచ్చని అంచనా. ఇలాంటి చిత్రరాజం ఇప్పుడు 50 రోజుల మార్క్ ను అందుకోబోతోంది. ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి2.. జూన్ 16తో దిగ్విజయంగా 50 రోజుల పండుగను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా 50 డేస్ స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు మేకర్స్. సినిమాలో ఉండే సూపర్బ్ మూమెంట్స్ ను పోస్టర్లుగా మలచడం ఆకట్టుకుంటోంది.

అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకున్న బాహుబలి2 నుంచి గూస్ బంప్స్ మూమెంట్స్ 50 డేస్ పోస్టర్లుగా వేశారు. నెంబర్ 1 బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ వేసిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/