Begin typing your search above and press return to search.
అమెరికాలో బాహుబలి ప్రకంపనలే
By: Tupaki Desk | 30 April 2017 6:54 AM GMTతెలుగు సినిమాలు అమెరికాలో ఫుల్ రన్లో మిలియన్ మార్కును అందుకోవడం గురించే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ కేవలం ఒక్క రోజులో 4.8 మిలియన్ డాలర్లు వసూలు చేసి ప్రకంపనలు రేపుతోంది. ఇది నిర్మాతలు అతి చేసిన చెబుతున్న లెక్క కాదు. స్వయంగా మూవీ డేటా బేస్ సంస్థ ‘ఐఎండీబీ’నే ఈ లెక్కలు ప్రకటించింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ అన్ని భాషల్లో కలిపి గురువారం ప్రిమియర్స్ తో సహా శుక్రవారం చివరి షోలు అయ్యేసరికి ఏకంగా 4.8 మిలియన్ డాలర్లు వసూలు చేసిందన్న వార్త ప్రకంపనలు రేపుతోంది. విశేషం ఏంటంటే.. ఈ వీకెండ్లో యుఎస్ బాక్సాఫీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో బాహుబలి-2 స్థానం రెండు కావడం విశేషం.
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-8 తర్వాత ఈ వారాంతంలో అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘బాహుబలి-2’నే కావడం విశేషం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ‘బాహుబలి-2’ కన్నా మరీ ఎక్కువ వసూళ్లేమీ సాధించలేదు. ఆ సినిమా శుక్రవారం 5.1 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. టామ్ హాంక్స్.. ఎమ్మా వాట్సన్ లాంటి ప్రముఖ హాలీవుడ్ తారలు నటించిన సినిమా ‘సర్కిల్’ బాహుబలి-2 కంటే తక్కువగా 3.2 మిలియన్ డాలర్లే వసూలు చేసింది. ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాలు సైతం ‘బాహుబలి-2’ లాగా అమెరికాలో ప్రభంజనం సృష్టించింది లేదు. గత ఏడాది ‘దంగల్’ సినిమాకే అక్కడి జనాలు ఔరా అనుకున్నారు. కానీ దాంతో పోలిస్తే ‘బాహుబలి-2’ భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/