Begin typing your search above and press return to search.
టెలివిజన్లోనూ బాహుబలి-2 ప్రకంపనలు
By: Tupaki Desk | 24 Oct 2017 4:58 PM GMT‘బాహుబలి’ ప్రకంపనలు వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. బుల్లితెర మీదా ఈ సినిమా సంచలనాల మోత మోగిస్తోంది. ఇటీవలే ‘బాహుబలి: ది కంక్లూజన్’ తెలుగు వెర్షన్ ను మా టీవీ ప్రసారం చేయగా రికార్డు స్థాయిలో 22కు పైగా టీఆర్పీ రేటింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. హిందీలో ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా.. అక్కడ కూడా కళ్లు చెదిరే రేటింగ్ తెచ్చుకుంది. టెలివిజన్ రేటింగుల్ని లెక్కలు ప్రకటించే బార్క్ గణాంకాల ప్రకారం అక్టోబరు 9న సోనీ మ్యాక్స్ ఛానెల్లో ప్రసారమైన ఈ చిత్రం 26054 ఇంప్రెషన్లు తెచ్చుకుంది. ఇప్పటిదాకా హిందీలో ఏ సినిమా కూడా టీవీలో ఈ స్థాయిలో ఇంప్రెషన్లు తెచ్చుకోలేదట. ఇది రికార్డని బార్క్ పేర్కొంది.
అక్టోబరు 2న స్టార్ గోల్డ్ ఛానెల్లో ప్రసారమైన సల్మాన్ ఖాన్ సినిమా ‘ట్యూబ్ లైట్’కు 5195 ఇంప్రెషన్లే వచ్చాయి. అంటే ‘ట్యూబ్ లైట్’తో పోలిస్తే ‘బాహుబలి-2’కు వచ్చిన ఇంప్రెషన్లు ఐదు రెట్లు ఎక్కువన్నమాట. బార్క్ లెక్కలు ప్రకటించిన వారంలో బాహుబలి-2.. ట్యూబ్ లైట్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. సింగం-2 హిందీ వెర్షన్ ‘మై హూ సూర్య సింగం-2’.. సూర్యవంశం.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాతి మూడు స్థానాలు సాధించాయి. ఈ మూడు సినిమాలూ సౌత్ కనెక్షన్ ఉన్నవే కావడం విశేషం. మొత్తంగా టాప్-5లో నాలుగు సినిమాలు సౌత్ కనెక్షన్ ఉన్నవే. దీన్ని బట్టే నార్త్ ఇండియాలో సౌత్ సినిమాల హవా ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.