Begin typing your search above and press return to search.
బాహుబలి 2.. అర మిలియన్ వచ్చింది
By: Tupaki Desk | 6 Feb 2018 12:41 PM GMTఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లలో సరికొత్త రికార్డును సృష్టించిన బాహుబలి ఎంతగా ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ సినిమాలకు పోటీగా వచ్చిన ఆ సినిమా ఒక్కసారిగా అందరిని ఆకర్షించింది, భాషాభేదం లేకుండా ఇండియాలోని ప్రతి రాష్ట్రం వారు మాట్లాడుకునేలా చేసింది. అయితే ఎట్టకేలకు సినిమా జపాన్ లో కూడా రిలీజ్ చేశారు సినిమా లో ఎమోషన్ అక్కడి ఆడియెన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ అందుకు తగ్గట్టుగా సినిమాను రెడీ చేసి భారీగా రిలీజ్ చేసింది.
పూర్తిగా జాపనీస్ భాషలో రిలీజ్ అయిన ఆ సినిమా మొత్తానికి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అంతే కాకుండా మంచి కలెక్షన్స్ ని రాబడుతూ..నిర్మాతలకు బయ్యర్స్ కి లాభాలను ఇచ్చే విధంగా ముందుకు సాగుతోంది. రీసెంట్ గా నిర్మాత శోబు యార్లగడ్డ ఈ విషయాన్ని తెలిపాడు. ఇప్పటికే సినిమా 6 వ వారానికి 550k డాలర్స్ ని రాబట్టిందని టాక్ పరంగా సినిమా బావుండడంతో కలెక్షన్స్ స్టడీ గా ఉన్నట్లు తెలిపాడు శోభు వివరించాడు.
ఇక బాహుబలి గురించి ట్వీట్ చేస్తోన్న అభిమానులకు కూడా శోబు కృతజ్ఞతలు చెబుతున్నాడు. బాహుబలి సినిమా పై చాలా మంది సోషల్ మీడియా ద్వారా చాలా రెస్పాండ్ అవుతున్నారని అర్ధమవుతోంది. ఇక సినిమాకు పెద్ద సినిమాల బెడద అక్కడ ఎక్కువగా లేకపోవడంతో కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. ఇలానే కొనసాగితే 1 మిలియన్ దాటేయడం కష్టమేమి కాదని అంటున్నారు బాక్స్ ఆఫీస్ ఎనలిస్టులు. మరి ఆ సినిమా ఎంతవరకు విజయం అందుకుంటుందో చూడాలి.