Begin typing your search above and press return to search.
ఖైదీ రికార్డులు ఒక్క రోజులో లేచిపోతాయా?
By: Tupaki Desk | 12 April 2017 7:15 AM GMTమూడు నెలల కిందట విడుదలైన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది. ఫుల్ రన్లో నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ చెరిపేసింది. తొలి రోజు అయితే ఏకంగా ‘బాహుబలి-ది బిగినింగ్’ కలెక్షన్లు కూడా దాటేసింది. బాహుబలి కలెక్షన్లను ఎవ్వరూ టచ్ చేసే సాహసం చేయలేరని అనుకున్నారు ఆనీ.. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ మీద ఉన్న ఆసక్తి.. ఈ చిత్రాన్ని తొలి రోజు రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేయడం.. గత రెండేళ్లలో సినిమాల కలెక్షన్ల రేంజ్ మరింత పెరగడం దీనికి కారణం. ఎలాగైతేనేం బాహుబలి డే-1 రికార్డును కొట్టి సింహాసనం మీద కూర్చున్నాడు చిరు. కానీ ఇప్పుడు బాహుబలి ప్రతీకారానికి రెడీ అయిపోతున్నాడు.
భారతీయ సినీ చరిత్రలోనే ఏ సినిమాకూ లేనంత హైప్ తో.. భారీ అంచనాలతో వస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’.. ఖైదీ నెంబర్ 150 మీద ప్రతీకారం ఘనంగానే తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరు సినిమా ఫుల్ రన్లో సాధించిన కలెక్షన్లను బాహుబలి-2 కేవలం ఒక్క రోజులో దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ ఫుల్ రన్లో రూ.105 కోట్ల షేర్.. రూ.160 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి-2 మీద ఉన్న అంచనాల ప్రకారం చూస్తే ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి తొలి రోజే ఈ వసూళ్లను దాటేస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వేల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తుండటం.. తొలి రోజు మరిన్ని ఎక్కువ థియేటర్లలో సినిమాను ప్రదర్శించే అవకాశం ఉండటం.. బెనిఫిట్ షోలు భారీగా పడబోతుండటం.. టికెట్ల రేట్లు కూడా పెంచే అవకాశముండటంతో బాహుబలి-2 కచ్చితంగా తొలి రోజు రూ.100 కోట్లకు పైగా షేర్ వసూలు చేయొచ్చని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/