Begin typing your search above and press return to search.
బాహుబలి రేటు.. ఎన్ని రెట్లయిందో చూడండి
By: Tupaki Desk | 2 Feb 2017 10:44 AM GMTబాహుబలి విడుదలయ్యే సమయానికి ఆ సినిమాపై ఉత్తరాది ప్రేక్షకులకు ఏమంత అంచనాలు లేవు. ఏదో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నాడని.. ట్రైలర్ ఏదో బావుందని కొంత ఆసక్తి చూపించారు తప్ప.. బాలీవుడ్ సినిమాలకు ఎగబడ్డట్లు ఎగబడ్డదేమీ లేదు. సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చాక.. పెద్ద పెద్ద రివ్యూయర్లు మంచి రేటింగ్స్ వచ్చాక.. మీడియాలో దీని గురించి పెద్ద చర్చ నడిచాక జనాల్లో ఆసక్తి పెరిగింది. థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో హిందీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన కరణ్ జోహార్ పంట పండింది. ఆ చిత్రానికి పెద్ద రేటేమీ పెట్టలేదు కరణ్. రూ.10 కోట్లు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి రైట్స్ తీసుకున్నాడు. విడుదల తర్వాత పేమెంట్ ఏమైనా పెంచాడేమో తెలియదు.
ఐతే కరణ్ రిలీజ్ చేయడం వల్లే ఈ సినిమాకు హైప్ వచ్చింది కాబట్టి.. థియేటర్లు కూడా బాగానే దక్కాయి కాబట్టి.. సినిమా ఎక్కువమందికి చేరువైందన్న సంతోషంలో ‘బాహుబలి’ నిర్మాతలు కూడా రిలీజ్ తర్వాత కరణ్ నుంచి పెద్దగా డబ్బులు ఆశించలేదని సమాచారం. ఐతే అప్పటికి శాటిలైట్ హక్కుల డీల్ అవ్వకపోవడంతో దాని ద్వారా మాత్రం బాగానే ముట్టింది. ఇక ప్రస్తుతం బాహుబలి రెండో భాగం మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన ఆడియన్స్ ఎంత ఉత్కంఠగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారో నార్త్ ఇండియన్స్ కూడా సినిమా మీద అంతే ఆసక్తితో ఉన్నారు. ఆ మధ్య 2017లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ మీద సర్వే చేస్తే దాదాపు 60 శాతం మంది బాహుబలికే ఓటేశారు. మిగతా సినిమాలన్నింటికీ కలిపి 40 శాతం ఓట్లే పడ్డాయి. ఈ ఆసక్తిని గమనించే ‘బాహుబలి: ది కంక్లూజన్’కు భారీగానే రేటు కట్టారు నిర్మాతలు. కరణ్ కూడా ఈ విషయంలో బెట్టు చేయకుండా డిమాండుకు తగ్గ రేటే ఇచ్చాడట. ఆ మొత్తం రూ.120 కోట్లని సమాచారం. తొలి భాగంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తంగా కనిపించొచ్చు కానీ.. ‘బాహుబలి’ మీద ఉన్న అంచనాల ప్రకారం ఈ చిత్రం హిందీ వరకే కనీసం రూ.200 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టవచ్చని అంచనా. ఇక ఓవరాల్ గా ‘బాహుబలి: ది కంక్లూజన్’ బిజినెస్ రూ.500 కోట్ల మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/