Begin typing your search above and press return to search.
బాహుబలి2.. టార్గెట్ మిస్ అయింది
By: Tupaki Desk | 2 Jan 2017 7:59 AM GMTబాహుబలి..ది కంక్లూజన్.. ఈ చిత్రం కోసం టాలీవుడ్ మాత్రమే కాదు.. దేశమంతా ఎదురుచూస్తోంది. అయితే.. ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. జూన్ తొలివారంలో బాహుబలి2 షూటింగ్ ని తిరిగి ప్రారంభించగా.. డిసెంబర్ చివరికల్లా మొత్తం షూట్ కంప్లీట్ చేసేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
కొన్ని సీన్స్ మినహా అన్నీ పూర్తయిపోతాయని.. షూటింగ్ కి డిసెంబర్ 31 న గుమ్మడికాయ కొట్టేసి గ్రాఫిక్స్ వర్క్ పై కాన్సంట్రేట్ చేయాలని యూనిట్ భావించింది. కానీ ఎంత వేగంగా పనులు జరిపినా.. ఇప్పటికీ కొన్ని సీన్స్ మిగిలిపోయాయట. అలాగే ప్యాచప్ వర్క్స్ సంబంధించి కూడా షూటింగ్ చేయాల్సి ఉందట. ఇవన్నీ పూర్తవడానికి మరో వారం రోజులైనా కనీసం పడుతుందని తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో రాజమౌళి ఏ మాత్రం రాజీపడకపోవడంతోనే.. షూట్ ఆలస్యం అయిందని అంటున్నారు.
షూటింగ్ విషయంలో డెడ్ లైన్ మిస్ అయినా.. ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ మాత్రం మారే సమస్య లేదట. ఇంకా నాలుగు నెలల టైం ఉండడంతో సినిమాను చెప్పిన తేదీకల్లా థియేటర్స్ లోకి తెస్తామంటున్నారు నిర్మాతలు. బాహుబలి2 షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతుండడం.. ప్రభాస్ చేయాల్సిన మరుసటి మూవీపై ప్రారంభానికి అడ్డంకిగా మారుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/