Begin typing your search above and press return to search.
‘బాహుబలి’ షోలను గుంపగుత్తగా అమ్మేస్తున్నారు
By: Tupaki Desk | 31 March 2017 5:24 AM GMTఇండియాలోని ప్రతి సినీ ప్రేమికుడూ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇంకో నెల రోజుల్లోపే థియేటర్లలోకి దిగిపోతోంది. ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘ది కంక్లూజన్’ టికెట్ల కోసం ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే అన్నట్లుంది. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే టికెట్లను హోల్ సేల్ గా అమ్మకానికి పెట్టేస్తున్నట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు కలిసి షోలు షోలే గుంపగుత్తగా అమ్మేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ లోని ప్రధాన మల్టీప్లెక్సుల్లో చాలా షోలను భారీ రేట్లకు అమ్మేస్తూ ముందే ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక లీడింగ్ మల్టీప్లెక్సులో ఒక షోను రూ.10-12 లక్షల మధ్య అమ్ముతున్నారట. ఆ లెక్కన చూస్తే టికెట్ రేటు కనీసం రూ.500 పలుకుతున్నట్లే. ఐతే రిలీజ్ సమయానికి డిమాండ్ మామూలుగా ఉండదు. వెయ్యి రెండు వేలైనా ఈజీగా కొనేస్తారని.. అందుకే రూ.500 టికెట్ అంటే కూడా ఎక్కువ మొత్తమేమీ కాదని అభిప్రాయపడుతున్నారు. సింగిల్ స్క్రీన్లలో కూడా టికెట్లను ఎక్కువ రేటు పెట్టి ఇప్పుడే గుంపగుత్తగా కొనుగోళ్లు చేస్తున్నట్లు సమాచారం. ‘బాహుబలి: ది బిగినింగ్’ నైజాం హక్కుల్ని దాదాపు పాతిక కోట్లు పెట్టి దిల్ రాజు సొంతం చేసుకుంటే.. ‘ది కంక్లూజన్’ రైట్స్ కోసం ఏకంగా రూ.50 కోట్లు పెట్టారు. ఆ మొత్తం రాబట్టుకోవడానికి ముందు నుంచే సన్నాహాల్లో పడ్డాడు డిస్ట్రిబ్యూటర్. ఇందులో భాగంగానే ఎగ్జిబిటర్లతో మాట్లాడి షోలు షోలనే గుంపుగత్తగా భారీ మొత్తానికి అమ్మేస్తున్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/