Begin typing your search above and press return to search.
ఆరే రోజుల్లో చిరు మెగా రికార్డు బద్దలు
By: Tupaki Desk | 5 May 2017 7:10 AM GMTతెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర అంటే వెనుకబడ్డ ప్రాంతం అన్న ఫీలింగ్ ఉంటుంది జనాల్లో. సినీ జనాల ఫీలింగ్ కూడా అలాగే ఉండేది ఒకప్పుడు. ఆ ఏరియా డిస్ట్రిబ్యూషన్ మీద అంతగా దృష్టిపెట్టేవాళ్లు కాదు. కానీ గత కొన్నేళ్లలో ఉత్తరాంధ్ర రేంజే మారిపోయింది. ఇక్కడ పెద్ద సినిమాలు వచ్చినపుడల్లా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
గరిష్టంగా 5-6 కోట్ల మధ్య ఉన్న ఉత్తరాంధ్ర మార్కెట్ ఏడాదిన్నర కిందట ‘బాహుబలి: ది బిగినింగ్’ వచ్చినపుడు అనూహ్యమైన స్థాయిని అందుకుంది. ఆ సినిమా రూ.9 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. ఐతే ఈ ఏడాది ఆరంభంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా రూ.10 కోట్ల మైలురాయిని దాటేసి ఆశ్చర్యపరిచింది. ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీనికే అందరూ అబ్బురపడితే.. ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ కేవలం ఆరు రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టేసింది.
అక్కడ ‘బాహుబలి-2’ షేర్ ఆరు రోజులకే రూ.14 కోట్లకు చేరుకుంది. ఇది అనితర సాధ్యమైన రికార్డే. ఫుల్ రన్లో ఇక్కడ బాహుబలి-2 రూ.25 కోట్ల షేర్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పటికీ సినిమా జోరు తగ్గలేదు. హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. రెండో వీకెండ్ అయ్యేసరికే షేర్ రూ.20 కోట్ల మార్కుకు చేరువగా వస్తుందని భావిస్తున్నారు. ఇక ఎవ్వరూ కూడా ఆ రికార్డును టచ్ చేసే సాహసం కూడా చేయలేరేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/