Begin typing your search above and press return to search.

బాహుబలి-2కి ఆ దేశంలో వంద కోట్లు?

By:  Tupaki Desk   |   6 May 2017 11:12 AM GMT
బాహుబలి-2కి ఆ దేశంలో వంద కోట్లు?
X
పదేళ్ల కిందట అమెరికాలో తెలుగు సినిమాకు మార్కెట్టే ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లలో అక్కడ మన సినిమాలు ఎలా రైజ్ అయ్యాయో.. ఎంతలా మార్కెట్ సంపాదించుకున్నాయో తెలిసిందే. 1 మిలియన్.. 2 మిలియన్.. ఇలా ఒక్కో మైలురాయిని అధిగమిస్తూ.. ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజ్ సమయానికి ఏకంగా 7 మిలియన్ డాలర్ల మైలురాయిని కూడా బ్రేక్ చేసింది తెలుగు సినిమా. ఇక ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రభంజనం గురించైతే చెప్పనక్కర్లేదు. వారం రోజుల్లోనే 13 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇండియన్ సినిమాల్లో ‘దంగల్’ నెలకొల్పిన రికార్డును కూడా ‘బాహుబలి-2’ దాటేసింది.

ఐతే ఇప్పటికే ‘బాహుబలి: ది కంక్లూజన్’ డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి రాలేదు. పబ్లిసిటీతో కలిపి 8 లక్షల డాలర్ల దాకా ఖర్చు పెట్టిన లాభాల్లోకి రావాలంటే ఈ సినిమా 15 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. అప్పటికి కానీ.. డిస్ట్రిబ్యూటర్ కు 8 మిలియన్ డాలర్ల షేర్ చేతికి రాదు. ఐతే రెండో వీకెండ్లోనూ ‘బాహుబలి-2’ వసూళ్లు భారీగానే ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో అదేమంత కష్టం కాదంటున్నారు. వీకెండ్ అయ్యేసరికే 15 మిలియన్ మార్కును ఈజీగా దాటేస్తుందని.. ఫుల్ రన్లో 17-18 మిలియన్ డాలర్ల మధ్య ఈ సినిమా వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే అమెరికాలో మాత్రమే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించబోతోందన్నమాట. ఇది సాధ్యమైతే గొప్పగా చెప్పుకోవాల్సిన రికార్డే. ఇండియాలోనే ఒక సినిమా వంద కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్పగా చెప్పుకుంటున్న రోజుల్లో.. మన సినిమా మరో దేశంలో వంద కోట్ల వసూళ్లు సాధించడమంటే మాటలా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/