Begin typing your search above and press return to search.
బాహుబలి అక్కడ కూడా ఈ రోజే విడుదల
By: Tupaki Desk | 27 April 2017 7:57 AM GMT‘బాహుబలి: ది కంక్లూజన్’ పండుగ ఒక రోజు ముందే వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందే రిలీజ్ చేసేస్తుండటం విశేషం. మామూలుగా ముందు రోజు అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలు వేయడం ఆనవాయితీ. ఐతే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఆ ఊసే లేదు. ఈ అనధికారిక ఫ్యాన్స్ షోల బదులు అధికారికంగానే ఈ చిత్రాన్ని ముందు రోజు రాత్రి నుంచే ప్రదర్శిస్తుండటం విశేషం.
హైదరాబాద్ లో బెనిఫిట్ షోలకు అనుమతి లేకపోవడంతో ఇక్కడ ముందు రోజు రాత్రి నుంచే డిస్ట్రిబ్యూటర్ పెయిడ్ ప్రివ్యూలకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. ఈ చిత్రానికి మరో రకంగా మినహాయింపు ఇచ్చారు. రాత్రి 9 గంటలకు పెయడ్ ప్రివ్యూలు వేసుకునే అవకాశమిచ్చారు. ముందు ఈ పెయిడ్ ప్రివ్యూలపై సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ.. మంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో ఇబ్బంది లేకపోయింది. తెలంగాణలోని మరికొన్ని నగరాల్లోనూ ముందు రోజు సెకండ్ షోల నుంచే పెద్ద ఎత్తున ‘బాహుబలి-2’ ప్రదర్శితం కానుంది. ఒక రకంగా ‘బాహుబలి-2’ 27నే రిలీజైపోతున్నట్లే అన్నమాట.
తెలంగాణలో ఈ పెయిడ్ ప్రివ్యూల వ్యవహారమేదో బాగుందని.. ఆంధ్రప్రదేశ్ బయ్యర్లు కూడా దీన్ని ఫాలో అయిపోతున్నారు. ఈ రోజు సెకండ్ షో నుంచే అధికారికంగా ‘బాహుబలి-2’ను నడిపించడానికి అక్కడ కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టికెట్ల అమ్మకం కూడా మొదలైపోయిందట. ఐతే ఈ షోలకు టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఫ్యాన్సీ రేటు పెట్టి గుంపగుత్తగా టికెట్లు కొనేస్తున్నారు. డిమాండును బట్టి బెనిఫిట్ షోల తరహాలోనే భారీ రేట్లకు టికెట్లను అమ్ముకుంటున్నారు. మరోవైపు కర్ణాటక.. తమిళనాడుల్లోనూ ఇదే తరహాలో పెయిడ్ ప్రివ్యూలు వేస్తున్నట్లు సమాచారం. ఇక ముంబయిలో సెలబ్రెటీల కోసం స్పెషల్ ప్రివ్యూ వేస్తున్నారు. మొత్తానికి కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడన్నది ఈ రోజు రాత్రికే తేలిపోతుందన్నమాట.