Begin typing your search above and press return to search.
బాహుబలికి కొత్త ఛాలెంజ్
By: Tupaki Desk | 20 April 2018 12:21 PM GMT అదేంటి సినిమా విడుదలై ఏడాది దాటింది పైగా టీవీలో కూడా వచ్చేసింది మళ్ళి ఈ ఛాలెంజ్ ఏంటి అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది కిటుకు. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించి ఈజీగా బద్దలు కొట్టలేని రికార్డులు సాధించిన బాహుబలి 2 ఇప్పటి దాకా చైనాలో విడుదల కాలేదు. రెండు నెలల క్రితం జపాన్ లో రిలీజ్ చేస్తే అక్కడ కూడా బంపర్ హిట్ కొట్టేసింది. ఇప్పుడు చైనాకు వెళ్తున్నాడు బాహుబలి 2. ఇంతకాలం సరైన ప్లాట్ కోసం వెయిట్ చేసిన బాహుబలి 2 మే 4వ తేది అక్కడి థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. ఈ మధ్య ఇండియన్ సినిమాలు అక్కడ భారీగా ఆడుతున్నాయి. దంగల్ గత ఏడాది ఒక్క చైనాలోనే 1200 కోట్లు రాబట్టగా సీక్రెట్ సూపర్ స్టార్ సైతం 800 కోట్ల దాకా రాబట్టి ఔరా అనిపించింది. లాస్ట్ ఇయర్ చైనాలో దంగల్ మే 5న విడుదలైంది. అక్కడ భారీ వసూళ్లు దక్కడంతో బాహుబలి 2ని వరల్డ్ వైడ్ ఓవరాల్ గ్రాస్ లో బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ లాగేసుకుంది.
ఇప్పుడు బాహుబలి 2 కనక అక్కడ దంగల్ స్థాయి విజయం కనక సాధిస్తే దాన్ని వెనకేసి ఫస్ట్ ప్లేస్ ని లాగేసుకోవచ్చు. దంగల్ అక్కడ విడుదలైనప్పుడు బాలీవుడ్ చేసిన హంగామా చిన్నది కాదు. బాహుబలి కంటే పెద్ద హిట్టు అని చెప్పుకోవడానికి నానా తిప్పలు పడింది. ఇప్పుడు బాహుబలి 2 కనక వెయ్యి కోట్లైనా తేగలిగితే దంగల్ ని దాటేయోచ్చు. గతంలో బాహుబలి ఫస్ట్ పార్ట్ రాంగ్ టైం లో జాకీ చాన్ సినిమాతో పోటీ పడి ఆశించిన కలెక్షన్లు దక్కించుకోలేదు. కాని బాహుబలి 2 కు ఆ సమస్య లేకుండా మంచి స్కెచ్ తో ప్లాన్ చేసింది ఆర్కా మీడియా. సంవత్సరాలు దాటుతున్నా ఒక తెలుగు సినిమా ఏదో ఒక రకంగా చర్చలో ఉండటం గత కొన్నేళ్ళలో ఒక్క బాహుబలికి మాత్రమే జరిగింది. ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడే చైనా సినిమా ప్రేమికులను బాహుబలి 2 మెప్పిస్తుందనే ధీమాలో ఉంది యూనిట్.