Begin typing your search above and press return to search.
మరో ప్రయాణానికి బాహుబలి 2 రెడీ
By: Tupaki Desk | 21 March 2018 11:23 AM ISTప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. ఈ ఐదేళ్లలో ఇండియన్ సినిమాలు హాలీవుడ్ స్థాయికి చేరడం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఒక సినిమా తరువాత మరొకటి విదేశీయులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా దంగల్ సినిమా చైనా లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసినిమా అక్కడి రికార్డులతో ఇండియాలోనే కలెక్షన్స్ పరంగా అతిపెద్ద సినిమాగా నిలించింది.
ఆ సినిమా 195 మిలియన్ల డాలర్లను అందుకుంది. అయితే మన బాహుబలి సినిమా కూడా భారతదేశమంతా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పార్ట్ 1 చైనాలో 123 మిలియన్ల డాలర్లను అందుకుంది. ఇక సెకండ్ పార్ట్ బాహుబలిని కూడా చైనాలో రిలీజ్ చేయాలనీ గత కొంత కాలంగా ఆర్కా మీడియా వారు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే సెన్సార్ పనుల ఆలస్యం వలన అప్పుడు రిలీజ్ కాలేదు. ఫైనల్ గా ఇప్పుడు సెన్సార్ పనులు పూర్తవ్వడంతో చైనాలో బాహుబలి - ది కంక్లూజన్ తన బాక్సాఫీస్ ప్రయాణానికి సిద్దపడుతోంది.
ఇ-స్టార్స్ మీడియా వారు సినిమాను చైనాలో రిలీజ్ చేస్తున్నారు. మరి బాహుబలి 2 దంగల్ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ భజరంగి భాయి జాన్ ని కూడా చైనాలో రిలీజ్ చేసందుకు ఆ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఎమోషన్ ని ఎక్కువగా ఇష్టపడే చైనా సినీ జనాలకు ఆ సినిమా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.