Begin typing your search above and press return to search.

బాహుబలి2 డ్యురేషన్ ఎంతో తెలుసా

By:  Tupaki Desk   |   11 April 2017 4:57 AM GMT
బాహుబలి2 డ్యురేషన్ ఎంతో తెలుసా
X
బాహుబలి ది కంక్లూజన్.. ఈ నెల 28న రిలీజ్ కానున్న ఈ చిత్రం దేశ సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టిస్తుందని.. ఎవరూ అందుకోలేకపోయిన రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి చరిత్రలో నిలిచిపోతుందని అంచనాలున్నాయి. జనాల్లో ఉన్న ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు బాహుబలి మొదటి భాగాన్ని రీరిలీజ్ విడుదల చేసి.. హిందీ నిర్మాత ఎదురు దెబ్బ తిన్నా.. బాహుబలి2పై ఏ మాత్రం ఆసక్తి తగ్గలేదు.

అయితే.. బాహుబలి 2 నిడివి ఎంత ఉంటుంది? తమ దగ్గర నాలుగు గంటల స్టోరీ ఉండడంతోనే రెండు భాగాలు చేయాల్సి వచ్చిందని గతంలో రాజమౌళి చెప్పాడు. మొదటి భాగంలో రెండున్నర గంటలు చూపించేశారు కాబట్టి.. ఇంకో గంటన్నర.. యుద్ధ సన్నివేశాలను పొడిగిస్తే 2 గంటల సినిమా ఉండొచ్చని అంతా అంచనా వేశారు. కానీ బాహుబలి2 రన్ టైం 2 గంటల 50 నిమిషాలకు కాస్త అటూఇటూగా ఉంటుందని రాజమౌళి చెప్పడంతో.. ఇప్పుడు నిడివి ఆ మేరకు సెట్ అయ్యేలా.. జాగ్రత్త పడుతున్నారు యూనిట్.

మొదటి భాగం రెండున్నర గంటలు చూపించినా.. కథేమీ లేకుండా కేరక్టర్ ఇంట్రడక్షన్ తో సరిపెట్టడమే జక్కన్న అసలు సిసలైన తెలివి చూపించాడు. ఇప్పుడు మొత్తం కథ అంతటినీ మూడు గంటల్లోపు సినిమాలో చూపించేయనున్నాడన్న మాట. మరో 18 రోజుల్లో ఈ సంచలన చిత్రం థియేటర్లలోకి వచ్చేయనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/