Begin typing your search above and press return to search.

బాహుబలిని ఎన్నిసార్లు అమ్ముతారు??

By:  Tupaki Desk   |   14 April 2017 4:20 AM GMT
బాహుబలిని ఎన్నిసార్లు అమ్ముతారు??
X
బాహుబలి 2 సినిమా రిలీజవ్వడానికి ఇంకా ఎంతో టైము లేదు. కేవలం రెండు వారాల్లో కట్టప్ప బహుబలిని ఎందుకు వెనుక నుండి పొడిచేశాడో మనకు తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు శాటిలైట్ న్యూస్ ఒకటి హల్చల్ చేస్తోంది. కాని ఇది విన్న వారు.. ఆల్రెడీ బాహుబలిని ముందే అమ్మేశారు కదా గురూ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక ప్రముఖ ఎంటర్టయిన్మంట్ ఛానల్ బాహుబలి 2 సినిమా శాటిలైట్ రైట్స్ ను ఏకంగా 30 కోట్ల రూపాయలకు కొనేసిందని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఈ ఛానల్ బాసులు మారారు కాని.. విషయం ఏంటంటే.. అసలు బాహుబలి తొలి భాగం రిలీజైనప్పుడే.. రెండు భాగాలూ కలిపి 20 కోట్లకు ఇదే ఛానల్ కొన్నట్లు వార్తలొచ్చాయి. అప్పుడు సదరు ఛానల్లో పనిచేసే కొందరు బిగ్ హెడ్స్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇప్పుడు మాత్రం 30 కోట్లు వెచ్చించి 2వ భాగాన్ని కొన్నారంటే కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. ఇంతకీ బాహుబలిని అప్పుడే కలిపి అమ్మేశారా? లేదంటే ఇప్పుడే రెండో భాగం అమ్మారా?

ఏదేమైనా కూడా 2వ భాగం గురించి హైప్ తేవడానికి రోజుకో న్యూస్ ను రిలీజ్ చేస్తూ బాహుబలి టీమ్ కాస్త గాట్టిగానే కష్టపడాల్సి వస్తోంది. ఈ మొత్తం వార్తల తాలూకు ప్రభావం.. రేపు 28న వచ్చే ఓపెనింగ్స్ బట్టి అర్ధమవుతుందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/