Begin typing your search above and press return to search.

రేపు రాత్రి నుండే బాహుబలి వాయింపుడు

By:  Tupaki Desk   |   26 April 2017 9:50 AM GMT
రేపు రాత్రి నుండే బాహుబలి వాయింపుడు
X
వెళ్ళండి ఐదు షో లు వేసుకోండి అని ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తే.. ఇప్పుడు బాహుబలి సినిమాను భారీ మొత్తం వెచ్చించి కొనుక్కున్న పంపిణీదారులు ఆగుతారా? అందుకే వారు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఈ మధ్యకాలంలో ఖైదీ నెం 150.. కాటమరాయుడు వంటి సినిమాలకు రాని పర్మిషన్లు.. బాహుబలి 2 సినిమా ప్రీమియర్లు బెనిఫిట్ షోలు వేయడానికి వచ్చేసింది. దానితో శుక్రవారం తెల్లవారుజామున కాకుండా.. గురువారం నైట్ నుండే బ్యాటింగ్ స్టార్ట్ చేశారు.

దాదాపు 43+ కోట్ల రూపాయలతో బాహుబలి 2 సినిమాను కొనుక్కున్న నైజాం డిస్ర్టిబ్యూటర్.. రేపు రాత్రి ఇతర సినిమాల సెకండ్ షోలు క్యాన్సిల్ చేసి.. ఆ స్థానంలో బాహుబలి 2 వేస్తున్నట్లు తెలుస్తోంది. 10 గంటలకు ప్రారంభయ్యే షోతో ఏకంగా అమెరికా కంటే ముందే మన దేశంలో బాహుబలి బెనిఫిట్ షోలు పడిపోతాయనమాట. అలాగే రాత్రి 10 గంటలకు షో వేశాక.. సినిమా నిడివి 3 గంటలు ఉంది కాబట్టి.. తక్కువ ఇంటర్వెల్ గ్యాపిచ్చి.. 12 గంటలకు మరో షో.. 3 గంటలకు ఇంకొక షో.. 7 గంటలకు మరొకటి.. 10 గంటలకు.. 1 గంటకు.. 4 గంటలకు.. 7 గంటలకు.. 10 గంటలకు ఇతర షోలు వేయాలని ప్లానింగులో ఉన్నారట. మరి గవర్నమెంట్ వీరికి రోజుకు 5 షోలు వేయడానికి పర్మిషన్ ఇచ్చిందిగా.. ఎలా మ్యానేజ్ చేస్తారు గురూ?

ఇంక ఆంధ్రప్రదేశ్ లో ఎలాగో తెలుగుదేశం ప్రభుత్వం రోజుకు 6 షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి.. మనోళ్లు ఎన్నేసి షోలైనా వేయొచ్చు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/