Begin typing your search above and press return to search.
వాట్సాప్ లో బాహుబలి స్టోరీ హల్ చల్
By: Tupaki Desk | 6 April 2017 10:15 AM GMT‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను అర్ధంతరంగా ముగించి ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాడు రాజమౌళి. కథ రసపట్టులో ఉండగా.. సినిమాను అలా ముగించడం జనాలకు ఎంతో అసహనం కలిగించింది. తర్వాత ఏమై ఉంటుందన్న ఉత్కంఠతో ఊగిపోయారు జనాలు. ఈ నేపథ్యంలో బాహుబలి కథ విషయంలో రకరకాల ఊహాగానాలు పుట్టాయి. జనాలు తమ క్రియేటివిటీతో చక్కటి కథలు అల్లేశారు. అప్పట్లో అవి సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేశాయి. క్రమ క్రమంగా ‘బాహుబలి’ కథ గురించి అందరూ మరిచిపోయారు. కానీ ఇప్పుడు ‘ది కంక్లూజన్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మళ్లీ జనాల దృష్టి మళ్లీ ఈ కథ మీద పడింది. ‘ది కంక్లూజన్’ కథ ఇది అంటూ తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు.
ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా ‘బాహుబలి: ది కంక్లూజన్’ స్టోరీ ఇదీ అంటూ ఒక మెసేజ్ ఫార్వర్డ్ అవుతోంది. స్వయంగా ‘బాహుబలి’ కథకుడు విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నట్లుగా చక్కగా విడమరిచి కథను అల్లేశారు ఈ క్రియేటివ్ పీపుల్. దేవసేన ఎవరు.. బాహుబలిని ఆమె ప్రేమలో ఎలా పడ్డాడు.. మహిష్మతిలో అంతర్యుద్ధం ఎందుకొచ్చింది.. శివగామి దేవికి బాహుబలిపై ఎందుకు కోపం వచ్చింది.. భల్లాలదేవుడు ఎలా కుట్రలు చేశాడు.. బాహుబలికి భల్లాలదేవుడికి యుద్ధం ఎలా మొదలైంది.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. దేవసేన ఎలా బందీగా మారింది.. శివగామికి బాహుబలిపై ఎలా అపార్థం తొలగిపోయింది.. బాహుబలి కొడుకుని ఆమె ఎలా కాపాడింది.. తర్వాత శివుడు ఎలా భల్లాలదేవుడిపైకి యుద్ధానికి బయల్దేరాడు.. ఎలా యుద్ధం గెలిచాడు.. ఇలా అన్ని అంశాల్ని పొందికగా అల్లారు ఇందులో. ఇది చదివితే నిజంగా ఇదే ‘బాహుబలి’ కథ అనిపించేలా ఉంది. మరి ఈ కథ అసలు కథతో ఎంత వరకు మ్యాచ్ అవుతుందన్నది ఈ నెల 28న తేలుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/