Begin typing your search above and press return to search.

బాహుబలి ఫ్యాషన్ షోలో తళుకులు

By:  Tupaki Desk   |   9 April 2017 8:36 AM GMT
బాహుబలి ఫ్యాషన్ షోలో తళుకులు
X
బాహుబలి2 చిత్రానికి ప్రచారం కల్పించడం కోసం రాజమౌళి అండ్ టీం రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తుంటే.. బాహుబలికి ఉన్న క్రేజ్ ని అడ్డం పెట్టుకుని.. తాము గుర్తింపు పొందేందుకు కూడా అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ బాహుబలి2కి ఉచితంగా ప్రచారం కల్పించే సాధనాలు కావడంతో.. రాజమౌళి అండ్ టీం నుంచి వీటికి సపోర్ట్ బాగానే వస్తోంది.

తాజాాగ ముంబైలో బాహుబలి ఫ్యాషన్ షో కూడా జరిగింది. బాహుబలి మూవీలో తారలు వాడిన దుస్తులను స్ఫూర్తిగా తీసుకుని డ్రెస్ లు డిజైన్ చేశామని చెప్పి.. ఈ బాహుబలి ఫ్యాషన్ షో నిర్వహించారు. అయితే.. ప్రారంభంలో హంగామా.. ఒకటీ అరా కిరీటాలు నగలు మినహాయిస్తే.. అన్ని ఫ్యాషన్ షోల మాదిరిగానే ఇది కూడా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రధారి.. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ కార్యక్రమంలో సందడి చేసింది. ఈమె కూడా రెగ్యులర్ కాస్ట్యూమ్స్ లో ఈ ఫ్యాషన్ షోకు హాజరైంది తప్ప.. బాహుబలి థీమ్ కనిపించలేదు.

అయితే.. ఈ ఫ్యాషన్ షోకి తమన్నా అందమే అసలు సిసలైన ఆకర్షణ అయింది. బ్లాక్ మిడ్డీలో నడుం భాగంలో మాత్రం కట్ తో.. తమన్నా చూపించిన సొగుసులు అందరినీ ఆకట్టుకున్నాయి. ర్యాంప్ పై తమ్ము హొయలు.. చాలామంది మనసులను మెలితిప్పేశాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/