Begin typing your search above and press return to search.

24 గంటల్లో ‘బాహుబలి’ ఏం చేశాడో చూడండి..

By:  Tupaki Desk   |   17 March 2017 6:30 AM GMT
24 గంటల్లో ‘బాహుబలి’ ఏం చేశాడో చూడండి..
X
ఇది మాటలకందని అద్భుతం. ‘బాహుబలి’కి మాత్రమే సాధ్యమైన ఘనత. కేవలం 24 గంటల వ్యవధిలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్.. కనీ వినీ ఎరుగని స్థాయిలో యూట్యూబ్ లో విధ్వంసమే సృష్టించింది. కేవలం తెలుగు ట్రైలర్ మాత్రమే ఒక్క రోజులో 2 కోట్లకు పైగా వ్యూస్ తెచ్చుకుని ప్రకంపనలు సృష్టించింది. నిన్న ఉదయం 10 గంటలకు ట్రైలర్ రిలీజైతే.. కేవలం ఏడున్నర గంటల్లోనే కోటి మార్కును అందుకోగా.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి... ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి 2 కోట్ల 10 లక్షల వ్యూస్ పూర్తి చేసుకుంది ‘బాహుబలి-2’ తెలుగు ట్రైలర్. ఈ ట్రైలర్ కు ఏకంగా 5 లక్షల లైక్స్ రావడం విశేషం. ఒక తెలుగు ట్రైలర్ కు ఈ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందని ఎవ్వరూ అనుకుని ఉండరు.

మిగతా మూడు భాషల్లోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ అదరగొడుతోంది. హిందీ ట్రైలర్ కూడా కోటి మార్కును దాటేసింది. 24 గంటల్లో ఈ ట్రైలర్ ఒక కోటి 10 లక్షల వ్యూస్ సాధించడం విశేషం. తమిళ ట్రైలర్ 50 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. మలయాళ ట్రైలర్ కూడా దాని స్థాయిలో అది అదరగొట్టింది. ఆ ట్రైలర్ 6 లక్షల వ్యూస్ మార్కుకు దగ్గరగా ఉంది. మొత్తంగా 24 గంటల్లో రెండున్నర కోట్లకు పైగా వ్యూస్ సాధించి ఔరా అనిపించింది ‘ది కంక్లూజన్’ ట్రైలర్. ఇంకో వారం రోజులైనా ఈ ట్రైలర్ జోరు కొనసాగే అవకాశముంది. అన్ని భాషల్లో కలిపి 5 కోట్ల వ్యూస్ పూర్తి చేసుకున్నా ఆశ్చర్యం లేదు. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/