Begin typing your search above and press return to search.
‘బాహుబలి-2’ ట్రైలర్ ఎన్నిసార్లు వేస్తారు?
By: Tupaki Desk | 15 March 2017 6:13 AM GMTఉత్కంటకు తెరపడబోతోంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ లాంచ్ కు సమయం దగ్గర పడుతోంది. ఇంకొక్క రోజులో ట్రైలర్ వచ్చేస్తుంది. భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా ట్రైలర్‌ను ప్రత్యేకంగా థియేటర్లలో ప్రదర్శించడం ‘బాహుబలి: ది బిగినింగ్’తోనే మొదలైంది. ఇప్పుడు ‘కంక్లూజన్’ ట్రైలర్ కూడా ఆ ఒరవడిని కొనసాగిస్తోంది.
ఈ గురువారం ఉదయం 9-10 గంటల మధ్య ట్రైలర్ థియేటర్లలో ప్రదర్శితమవుతుంది. ఇది తెలుగు ప్రేక్షకులకు మాత్రమే దక్కిన అవకాశం. తమిళం.. హిందీ.. మలయాళ భాషల్లోనూ ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద భారీ అంచనాలు.. ఆశలు ఉన్నప్పటికీ.. ట్రైలర్ ను థియేటర్లలో ప్రదర్శించడం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం. మిగతా ప్రేక్షకులందరూ సాయంత్రానికి యూట్యూబ్ లో ట్రైలర్ చూసుకోవాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 200 థియేటర్లలో ‘ది కంక్లూజన్’ ట్రైలర్ ప్రదర్శించనున్నారు. ఈ ట్రైలర్ వీక్షణం ఉచితం. ఎవ్వరైనా థియేటరుకెళ్లి ట్రైలర్ చూడొచ్చు. ‘బాహుబలి’ పేరిట ఉన్న ట్విట్టర్ అకౌంట్లో జిల్లాల వారీగా ట్రైలర్ ప్రదర్శించే థియేటర్ల లిస్టు పెట్టారు. ఐతే ట్రైలర్ ను థియేటర్లలో కచ్చితంగా ఏ సమయానికి ప్రదర్శిస్తారు.. ఎన్నిసార్లు ప్రదర్శిస్తారన్న క్లారిటీ లేదు. 9-10 గంటల మధ్య అని టైం ఇచ్చిన బాహుబలి నిర్మాతలు.. కచ్చితమైన టైమింగ్ కోసం స్థానిక డిస్ట్రిబ్యూటర్ లేదా థియేటర్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలన్నారు. ‘ది బిగినింగ్’ ట్రైలర్ ను అప్పట్లో థియేటర్లలో ఒక్కోసారి మాత్రమే ప్రదర్శించారు. మరి ఈసారి కూడా అలాగే చేస్తారా.. ప్రేక్షకుల తనివి తీరేలా మళ్లీ మళ్లీ వేస్తారా అన్నది కూడా స్పష్టత లేదు. ఈ విషయంలో ‘బాహుబలి’ నిర్మాతలేమైనా ఆదేశాలిచ్చారా లేక థియేటర్ యాజమాన్యాల విచక్షణ మేరకు నడుచుకుంటారా అన్నది తెలియదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/