Begin typing your search above and press return to search.

ఇదీ బాహుబలి 500 కోట్ల లెక్క

By:  Tupaki Desk   |   8 Aug 2015 10:45 AM GMT
ఇదీ బాహుబలి 500 కోట్ల లెక్క
X
బాహుబలి విడుదల కాక ముందు ఆ సినిమా రూ.300 కోట్ల మార్కు అందుకుంటుందన్నా జనాలు నమ్మేవారు కాదేమో. కానీ ఇప్పుడా సినిమా వసూళ్లు రూ.500 కోట్లు దాటిపోయాయి. అది కూడా తొలి 24 రోజుల్లోనే బాహుబలి ఈ రికార్డును అందుకోవడం విశేషం. బాలీవుడ్ సినిమాలకు కూడా అరుదుగా సాధ్యమయ్యే రికార్డిది. ఇంతకీ బాహుబలి 500 కోట్ల లెక్కేంటో చూద్దాం పదండి.

* మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు బాహుబలి రూ.142 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం.

* కర్ణాటకలో రూ.67.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది బాహుబలి.

* తమిళ వెర్షన్ రూ.65.5 కోట్లు, మలయాళ వెర్షన్ రూ.10.1 కోట్లు, హిందీ వెర్షన్ రూ.145 .6 కోట్లు గ్రాస్ రాబట్టింది.

* మొత్తంగా ఇండియా వరకు బాహుబలి గ్రాస్ రూ.430.6 కోట్లు. నెట్ రూ.353.15 కోట్లు, షేర్ రూ.224.9 కోట్లు.

* ఇక ఓవర్సీస్ వసూళ్ల విషయానికొస్తే యుఎస్, కెనడా కలిపి రూ.51.22 కోట్ల గ్రాస్, రూ.33.3 కోట్ల షేర్ వచ్చింది.

* మిగతా ఏరియాలన్నీకలిపి రూ.18.83 కోట్ల గ్రాస్, రూ.11.3 కోట్ల షేర్ వచ్చింది.

* ఇలా మొత్తం వసూళ్లు రూ.500.65 కోట్లకు చేరుకున్నాయి. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ రూ.269.5 కోట్లు.

* తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ రూ.142 కోట్లు కాగా.. నెట్ వసూళ్లు రూ.128 కోట్లు కాగా.. షేర్ రూ.102 కోట్లు.

* నైజాం ఏరియాలో గ్రాస్ రూ.55 కోట్లు, నెట్ రూ.48.8 కోట్లు, షేర్ రూ.37.35 కోట్లు వచ్చాయి.

* ఆంధ్రాలో రూ.61.75 కోట్ల గ్రాస్, రూ.56.2 కోట్ల నెట్, రూ.44.12 కోట్ల షేర్.. సీడెడ్ (రాయలసీమ)లో రూ.25.25 కోట్ల గ్రాస్, రూ.22.95 కోట్ల నెట్, రూ.20.33 కోట్ల షేర్ వసూలైంది.