Begin typing your search above and press return to search.

షేకింగ్: బాహుబ‌లి-3 అండ‌ర్ ప్లానింగ్‌?

By:  Tupaki Desk   |   31 July 2018 5:02 PM GMT
షేకింగ్: బాహుబ‌లి-3 అండ‌ర్ ప్లానింగ్‌?
X
అవునా? ఇది నిజమా? ఒక‌వేళ నిజ‌మైతే షేకింగ్ షాకింగ్ న్యూసే. జక్క‌న్న బాహుబ‌లి పార్ట్ 3 తెర‌కెక్కించే ఆలోచ‌నలో ఉన్నాడా? అంటే అది నిజంగానే ఆ సిరీస్ అభిమానుల‌కు వెయ్యి ఏనుగుల బలం అందించిన‌ట్టే. బాహుబ‌లి లాంటి క్రేజీ సిరీస్‌లో ఎన్ని సినిమాలొచ్చినా చూసేందుకు ఫ్యాన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే అంత భారీ కాన్వాసుతో ఐదేళ్లు కేటాయించే ఓపిక లేకే రాజ‌మౌళి వ‌ద్ద‌నుకున్నారు. ఆ క్ర‌మంలోనే ఆయన ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్‌ కు తెర తీశారు.

అదంతా అటుంచితే ఓవైపు రాజ‌మౌళి- విజ‌యేంద్ర ప్ర‌సాద్ బృందం ఈ మ‌ల్టీస్టార‌ర్ క‌థ ప‌నిలో ఉంటే అటువైపు ఉత్త‌రాదిన ఓ ఆస‌క్తిక ప్ర‌చారం మొద‌లైంది. రాజ‌మౌళి మౌండ్‌ లో బాహుబ‌లి త‌ర‌హా వేరొక ఆలోచ‌న ఉంది. ఇప్ప‌టికే విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఆ త‌ర‌హా స్క్రిప్టును వినిపించారు. అయితే దానిని కాద‌నుకున్నాకే.. అత‌డు ఓ థ్రిల్ల‌ర్ స్క్రిప్టున‌కు ఓకే చేశాడు.. అంటూ ప్ర‌చారం సాగుతోంది. బాహుబ‌లి పాత్ర‌ల‌కు కొన‌సాగింపు పార్ట్‌ని లేదా ప్రీక్వెల్ - సీక్వెల్ కాని క‌థ‌తో సెట్స్‌ కెళ్లే ఛాన్స్ అయితే ఉంది. దీనిపై అప్ప‌ట్లోనే బోలెడంత ప్ర‌చార‌మైనా జ‌క్క‌న్న ఏమంత ఆస‌క్తి చూపించ‌లేదు. మ‌రోవైపు విజ‌యేంద్ర ప్ర‌సాద్ సైతం ఓ ప‌ది క‌థ‌ల్ని త‌యారు చేసి ప‌దిమంది ద‌ర్శ‌కుల్ని వెబ్‌ సిరీస్‌ ల పేరుతో ప‌రిచ‌యం చేసేందుకు ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్ సంస్థ‌తో ఒప్పందం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ఆ ప‌నిలో బిజీగా ఉంటే ఈ ప్ర‌చార‌మేంటో? ఒక‌వేళ ఈ ప్ర‌చార‌మే నిజమై స‌డెన్‌ గా `బాహుబ‌లి 3` తీస్తున్నామ‌ని ప్ర‌క‌టిస్తే ఇక అభిమానుల్లో సంబ‌రాలు మొద‌లైపోవ‌డం ఖాయం. అలానే జ‌ర‌గాల‌ని ఆకాంక్షిద్దాం.