Begin typing your search above and press return to search.

బాహుబలి: 9 రోజులు, 303 కోట్లు, 9వ స్థానం

By:  Tupaki Desk   |   19 July 2015 11:21 AM GMT
బాహుబలి: 9 రోజులు, 303 కోట్లు, 9వ స్థానం
X
జూలై 10న విడుదలైన ''బాహుబలి'' సినిమా నిన్న శనివారంతో ధియేటర్ల లోకి వచ్చి 9 రోజులైంది. ఏదో తొలిరోజున సినిమా పబ్లిసిటీ స్టంట్స్‌ వర్కవుట్‌ అయ్యి 42.3 కోట్లు వచ్చాయి అన్నారు. కాని అది ఇండియా లోని టాప్‌ స్కోర్‌. ఇకపోతే మొదటి వీకెండ్‌ కలెక్షన్లు చూసి ఖంగుతిని.. సోమవారం నుండి చూద్దాం లే అన్నారు. ఎన్నిసార్లు ఎలా తిరగేసి చూసినా కూడా బాహుబలి క్రేజ్‌ బాహుబలి దే. నిన్న శనివారంతో ఓ సరిక్రొత్త రికార్డును పటాపంచెలు చేసింది ఈ రాజమౌళి క్రియేషన్‌. పదండి చూద్దాం.

ఇండియా లోని తెలుగు, తమిళ్‌, హిందీ వర్షెన్లు.. అలాగే ఓవర్‌సీస్‌ లో అన్ని టెరిటరీలు కలుపుకొని ఏకంగా 303 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది ''బాహుబలి''. ఇప్పటివరకు మన దేశంలో 300 కోట్ల పైన వసూలు చేసిన సినిమాలు 8 ఉన్నాయి. వాటి సరసన ఆఖరి స్థానంలో నిలుస్తూ బాహుబలి 9వ మెంబర్‌ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫీట్‌ ను సదరు సినిమాలన్నీ లైఫ్‌ టైమ్‌ లో చేస్తే.. బాహుబలి మాత్రం కేవలం 9 రోజుల్లో చేయడం విశేషం. ఇకపోతే టాప్‌ గ్రాసర్‌ రీసెంటుగా చైనా లో కూడా విడుదలైంది కాబట్టి దానిని కూడా కలుపుకొని మొత్తంగా 730 కోట్ల ధియేట్రికల్‌ కలెక్షన్స్‌ రాబట్టి. ఆ తరువాత ధూమ్‌ 3 (540 కోట్లు), 3 ఈడియట్స్‌ (395 కోట్లు), చెన్నయ్‌ ఎక్స్‌ ప్రెస్‌ (393 కోట్లు).. చివరిగా క్రిష్‌ (307 కోట్లు) లైన్లో ఉన్నాయి. అయితే వీటిల్లో ఓ నాలుగు సినిమాల రికార్డును ఎగబాకి బాహుబలి 3-4 స్థానాల్లో ఉంటుంది ప్రస్తుతం అంచనా. ఒకవేల సినమా 400 కోట్ల క్లబ్బు లోకి చేరినా ఆశ్చర్యం లేదు.

ఇకపోతే మన సౌత్‌ లో ఇప్పటివరకు రోబో సినిమా ఒక్కటే అత్యధికంగా 298 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. అన్ని వర్షెన్ల లో కలుపుకొని ఫ్లాపైన 'ఐ' సినిమా కూడా 239 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డులన్నీ చరిత్ర లో కలిపేస్తూ 84 ఏళ్ల సౌత్‌ సినిమా చరిత్ర లో తొలిసారిగా ఓ 300 కోట్ల క్లబ్‌ ఎంట్రీ సాధించింది బాహుబలి. అది తెలుగు వారు తయారు చేసిన సినిమా కావడం మనకు గర్వకారణమే