Begin typing your search above and press return to search.

బాహుబలి.. శ్రీమంతుడు.. వాట్స్‌ రాంగ్‌?

By:  Tupaki Desk   |   9 Nov 2015 3:30 PM GMT
బాహుబలి.. శ్రీమంతుడు.. వాట్స్‌ రాంగ్‌?
X
టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల రికార్డులు తీస్తే.. అందులో ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి - సెకండ్ ప్లేస్ లో శ్రీమంతుడు ఉన్నాయి. రెండూ ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాలే. తెలుగు ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకున్న ఈ మూవీస్ పై.. అవార్డుల అంచనాలు కూడా చాలానే ఉన్నాయి.

ఎందుకంటే బాహుబలి ఓ విజువల్ వండర్. శ్రీమంతుడు కమర్షియల్ బ్లాక్ బస్టర్. గ్రాఫిక్ మాయాజాలాన్ని హాలీవుడ్ స్థాయిలో తీశాడన్న పేరు జక్కన్న సంపాదిస్తే.. ఓ మెసేజ్ ని కమర్షియల్ ఫార్మాట్ లో చూపించడంలో మహేష్ ని హీరో చేసి కొరటాల సక్సెస్ అయ్యాడు. మరి ఇంతటి హిట్స్ కొట్టిన సినిమాలకు అవార్డులు - రివార్డులు ఎక్స్ పెక్ట్ చేయడం ఏమాత్రం తప్పులేదు. దురదృష్టవశాత్తూ గోవాలో ఈ నెల జరగనున్న అంతర్జాతీయ సినీ వారోత్సవాలకు కూడా బాహుబలి - శ్రీమంతుడు సెలక్ట్ కాలేదు. ఇందులో గుణ్ణం గంగరాజు - ప్రవీణ్ సత్తారు లాంటి టాలీవుడ్ డైరెక్టర్స్ జ్యూరీలో ఉన్నా సరే.. మన తెలుగులో ఒక సినిమాకి కూడా ఎంట్రీ దొరకలేదంటే ఆశ్చర్యం వేయకమానదు.

ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా బ్లాక్ బస్టర్స్ అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మరి కంటెంట్ విషయంలో ఆలోచిస్తే.. కొన్ని ఆసక్తకరిమైన కామెంట్లు వినిపిస్తున్నాయ్‌. అబ్బే శ్రీమంతుడుకేంటి సూపర్ మెసేజ్ అనచ్చు. ఊరిని దత్తత తీసుకోవడం అన్న మెసేజ్ కరెక్టే కానీ... తండ్రి సంపాదించిన ఆస్తిని ఉపయోగించడం తప్ప ఏం చేయని కేరక్టర్ హీరోది. కనీసం ఊరి జనాలను మార్చే ప్రయత్నం కూడా ఇసుమంతైనా కనిపించదు. అందుకే సెలక్షన్ కమిటీకి శ్రీమంతుడులో మెసేజ్ కనిపించదు. ఇక ఇండియాలో ఇలాంటి ఎటెంప్ట్ చేయకపోవడం బాహుబలికి ప్లస్ పాయింట్. అంతే కాదు.. గ్రాఫిక్స్ ని పక్కాగా ఉపయోగించినంత మాత్రాన.. అందులో జనాలకు కొత్తగా చెప్పేదేం ఉండదు. ఆయా పాత్రల ఔచిత్యాన్ని అర్ధం చేసుకోవడానికి.. బాహుబలిలో అవకాశం లేదు. ఎందుకంటే దాదాపు అన్ని కేరక్టర్స్ అసంపూర్తిగా ఉంటాయి. సీక్వెల్ గా వచ్చే చిత్రాలకు ఇదే పెద్ద మైనస్.

ఇదీ బాహుబలి - శ్రీమంతుడు చిత్రాలకు అవార్డ్ ఫంక్షన్ లలో కనీసం స్క్రీనింగ్ కి కూడా చోటు దొరక్కపోవడానికి కారణం అంటున్నారు విశ్లేషకులు.